20-02-2025 12:00:00 AM
డా.రక్కిరెడ్డి ఆదిరెడ్డి
ఆధిపత్య వర్గాలు పార్టీలను, అధికారాన్ని, ధనాన్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడం ప్రత్యర్థులకు కంటగింపుగా మారింది. వారి మాయోపాయాలు మెజారిటీ సామాజిక వర్గాల ప్రజలకు తెలియనివి కావు. ఎస్సీ, ఎసీ,్ట బీసీ, మైనారిటీ వర్గాలు ఐక్యతను సాధించగలితే ఆ ఆధిపత్యానికి కళ్లెం పడక తప్పదు.
ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాంగ వ్యవస్థ కలిగిన భారతదేశంలోని రాజకీయ వ్యవస్థ కేవలం ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించడమే తప్ప, ప్రజా సంక్షేమం, అభివద్ధి కార్యక్రమాలు అనే విషయాన్ని పూర్తిగా విడనాడుతున్నట్లు విమ ర్శలు ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎన్నికలలో గెలిచిన తర్వాత తామిచ్చిన వాగ్దానాలు, రాజ్యాంగబద్ధంగా నిర్వహిం చాల్సిన అభివృద్ధి ఏ మేరకు జరుగుతున్నా యో ఒక్కసారి ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ఉన్నవారు తమకు తాముగా ప్రశ్న వేసుకోవాలి.
అప్పుడే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ప్రజలకు ఏ మేరకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయో అనే విషయం అర్థమవుతుంది. నాయకులకు అభద్రత పెరిగిన కొద్దీ ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ప్రారంభమైనది. ఆధిపత్య వర్గాలు పార్టీలను, అధికారాని,్న ధనాన్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకున్న కారణంగా మిగతా వర్గాలు ఆ పొలిమేరలకు కూడా రాకుండా చేయడం అనేది ప్రత్యర్థులకు కంటగింపుగా మారింది.
ఆధిపత్య వర్గా లు ఎప్పటికీ తమ మాట నెగ్గుతుందని, అధికారం కొనసాగుతుందని దానిని శాశ్వ తం చేసుకోవడానికి పన్నుతున్న మాయోపాయాలు మెజారిటీ సామాజిక వర్గాల ప్రజలకు తెలియనివి కావు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ఐక్యతలోని డొల్లతనాన్ని గమనించిన ఇతర ఆధిపత్య కులాలకు చెందిన వాళ్లు అధికారానికి దూరంగా బ్రతకలేరనేది నగ్న సత్యం.
ఇటీవలి కాలంలో తెలంగాణలో గత 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికలలో ప్రజల ఆగ్రహానికి గురై ఓటమిపాలైన బీఆర్ ఎస్ పార్టీ తిరిగి అధికారానికి రావడానికి పడరాని పాట్లు పడుతూ గెలిచిన ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతూ ప్రజల దష్టిలో మెప్పును పొందడానికి ప్రయత్నించడం కేవలం అధికారం కోసమే తప్ప ప్రజల సమస్యల పరిష్కారం గురించి కాదు.
త్వర లో ఉప ఎన్నికలు వస్తాయని, గెలిచేది మేమేనని కల్లబొల్లి కబుర్లతో కాలయాపన చేయడం ఆధిపత్య వర్గాల నిజస్వరూపా న్ని బయటపెడుతున్నది. ఈ విషయంలో మిగతా సామాజిక వర్గాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది.
ఆ క్రమంలో భాగమే బీఆర్‌ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో కొనసాగినా దళితు న్ని ముఖ్యమంత్రి చేస్తానని ఇచ్చిన ప్రధానమైన హామీని నెరవేర్చకపోగా, మూడు ఎకరాల భూమితో పాటు అన్నింటిని వదిలి సామాన్యులను అన్ని రకాల అవకాశాలకు దూరంగా ఉంచి చట్టసభ ల్లో అధికారాన్ని నిండుగా సంపాదించుకోవడంతో పాటు తన కుటుంబంలోని వారందరికీ పదవులను కట్టబెట్టుకున్న తీరు తెలవదా? అలాంటి కుటుంబం నుండి వచ్చిన ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోబీసీలకు అన్యాయం జరిగిందని మాట్లాడడం, ధర్నాలు చేయ డం అంటే నేల విడిచి సాము చేయడమే.
నిరభ్యంతరంగా నిబద్ధతతో మద్దతీస్తే అభ్యంతరం లేదు కానీ మీ పదవీకాలంలో చేయని పనిని కాంగ్రెస్ హయాంలో ఎం దుకు చేయరని డిమాండ్ చేయడంలోనే డొల్లతనం, స్వార్థ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలను మెజారిటీ వర్గాలు పసిగట్టాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.
కడుపు నిండినా ఇంకా తృప్తి లేదా?
తెలంగాణ రాష్ర్ట శాసనసభను గణాంకాలతో సహా పరిశీలించినప్పుడు 2023 శాసనసభ ఎన్నికల నాడు గెలిచిన బీసీ ప్రజా ప్రతినిధుల సంఖ్య 19 కాగా వారి జనాభా కోటీ 86 లక్షలు. అదే 10 లక్షల 99 వేల 574 మంది ఉన్న రెడ్డి జనాభాకు 43 మంది సభ్యులు ఎన్నికైనారు. నిజం గా వారి జనాభా ప్రకారంగా ఉండవలసిన సంఖ్య 3-4 మాత్రమే. ఇక వెలమ కులానికి చెందినటువంటి వాళ్ళు 13 మంది శాసనసభ్యులు ఉంటే వారి జనాభా 1 లక్ష 2006 మాత్రమే.
జనాభా దామాషాలో ఉండవలసినటువంటి సంఖ్య కేవలం ఒక శాసనసభ్యుడు మాత్రమే. ప్రధానమైనటువంటి మూడు ఆధిపత్య కులాల జనాభా కు వచ్చిన సీట్లు ఉండవలసినటువంటి సంఖ్యను లెక్కించినప్పుడు బీసీ జనాభా ప్రకారంగా 62 మంది సభ్యులు ఉండాల్సిన అవసరం ఉంది కానీ దానికి బదులు 19 మంది మాత్రమే ఎన్నికైనారు.
అందుకే ఈ కులాలు తమ రాజకీయ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి అనివార్యమైన పరిస్థితిలో మేమెంతో మాకు అంత వాటా రావాలి అందుకే చట్టసభల్లో ముఖ్యంగా పార్లమెంటులో బిల్లును ఆమోదించడం ద్వారా సుమారు 60 శాతం ఉన్న బీసీలకు 60 శాతం కేటాయించాలని డిమాండ్ చేయడం గత దశాబ్దాలుగా కొనసాగుతున్నది.
ఈ దుర్భరమైనటువంటి పరిస్థితిని ఒక్కసారి అర్థం చేసుకుంటే ఇటీవల కాలం లో పెరిగిన చైతన్యం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను ఐక్యం చేస్తున్నది అనడంలో సందేహం లేదు. మరొకవైపు శక్తికి, జనాభాకు మించి ఇప్పటికే ఆధిపత్యాన్ని చలాయిస్తూ సింహాసనాలు అధిరోహించినటువంటి అగ్రవర్ణాలు తమ పట్టును శాసనసభతో పాటు శాసనమండలిలో కూడా కొనసాగించాలనే నెపంతో ప్రధా న కాంగ్రెస్, బీజే పీ పార్టీలు రెడ్డి వర్గానికి చెందిన వాళ్లను అభ్యర్థులుగా ఎంపిక చేశాయంటే బీసీ, ఇతర వర్గాలకు ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అదే బాధ, ఆవేశం, ఆందోళన నుండి పెరిగిన కసి, చైతన్యం తమ వర్గాలను గెలిపించుకోవడానికి నేడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన భూమికగా పనిచేస్తున్నది.
ఎమ్మెల్సీ ఎన్నికలే తగిన సమయం
మరొకవైపు రాష్ర్ట, జాతీయ స్థాయి బీసీ సంఘాలు వరంగల్, ఖమ్మం, నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ, కరీంనగర్, నిజా మాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీతో పాటు కరీంనగర్, ఆదిలాబా ద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు బీసీ సభ్యులు పోటీ చేస్తున్న సందర్భంలో ఎందరు ఉంటే అం దరికీ ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేయాలని, మన ఓట్లు మన వర్గాల సభ్యులకే వేసుకోవడం ద్వారా మన సత్తా చూపి అ గ్రవర్ణాల సభ్యులను ఓడించాలని ఇచ్చిన పిలుపు ఇటీవల కాలంలో పెద్ద చర్చకు దారితీస్తున్నది.
ఇదే సందర్భంలో అటు బీసీ ఇతర కుల సంఘాలతో పాటు పట్టభద్రులు, ఉపాధ్యాయులు, సామాజికవేత్త లు, కవులు కళాకారులు, మేధావులు అం దరూ కూడా ఆలోచించి ఆధిపత్యాన్ని ధిక్కరించడానికి ముందుకు రావాల్సిన అవ సరం ఉంది. ఇంతకాలం అనుభవించినది చాలు ఇకపైన కింది నుండి పైస్థాయి వర కు ఎస్సీలు, ఎస్టీ, మైనారిటీ, దళితులు, ఆదివాసీలకు వారి దామాషాలో అగ్ర తాంబూలం కట్టబెట్టడం ద్వారా మన ప్రాంతాన్ని మనమే ఏలుకుందాం మన వాటాను మనం సాధించుకుందాం అనే విధంగా చైతన్యం కావాల్సిన అవసరం సమయం కూడా ఆసన్నమైనది.
ముఖ్యం గా ప్రస్తుతం జరుగుతున్న మూడు ఎమ్మె ల్సీ స్థానాల ఎన్నికలలో ఈ చైతన్యాన్ని ఓటు రూపంలో వినియోగించుకొని ఆధిపత్య కులాలను ఓడించడం ద్వారా మన శక్తిని ప్రదర్శించినట్లయితే రాబోయే సాధారణ ఎన్నికల్లో విజయం మనదే, రాజ్యం మనదే. టిక్కెట్లు ఇచ్చే పార్టీల నాయకత్వం కూడా మన చేతిలోనే ఉంటుంది అప్పుడు మనమెంతో మనకంత అనేది సులభంగా సాధ్యమవుతుంది.
అందుకోసమే ఆధిప త్య వర్గాలు ఎంతైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో అంతకు మించిన స్థాయిలో మిగతా సామాజిక వర్గాలు మించిన స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ద్వారా ఒక్క ఓటును కూడా వృధా చేయకుండా మన బానిసత్వానికి ఇంతకాలం మనకు జరిగిన నష్టానికి బాధ్యులైనటువంటి ప్రత్యర్థులపైన తగిన సమయం లో వేటు పడాల్సిందే.
ఆ ఆలోచన, పౌరు షం, చైతన్యం, అధికారకాంక్ష మనలో రగి లి సెగలాగా ఎదిగి చైతన్య కాంతులు వెదజల్లాలి. ఈ మూడు స్థానాలలోనూ అధికా రాన్ని చేజిక్కించుకోవాలి. అప్పుడే మనవై పు సమాజం చూస్తుంది. టికెట్ల కోసం ఇకనుండి అన్ని వర్గాలు మన వైపే చూస్తారు ఆ సమయం ఆసన్నమైంది.