- 65 ఏళ్లు దాటినా రిటైర్ కాని ఉద్యోగి
- ఇప్పటికే మూడు దఫాలుగా సర్వీస్ పెంచిన గత ప్రభుత్వం
- నేటితో ముగియనున్న పెరిగిన పదవీ కాలం
- మళ్లీ ఎక్స్‌టెన్షన్ కోసం పైరవీలు షురూ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 30 (విజయక్రాంతి): ఆ ప్రభుత్వ ఉద్యోగి వయసు ప్రస్తుతం 65 ఏళ్లు. ప్రభుత్వ సర్వీస్ రూల్స్ ప్రకారం 2016లోనే రిటైర్ కావాలి. కానీ నేటి వరకు ఆ అధికారికి రిటైర్మెంట్ లేదు. ఆయన సేవలు అవసరమని భావించిన గత కేసీఆర్ ప్రభుత్వం సర్వీసును మూడు దఫాలుగా పెంచింది. దీంతో ఆ అధికారి వయసు 65 ఏళ్లు దాటినా గత ఎనిమిదేళ్లుగా కూర్చుంటున్న కుర్చీని మాత్రం వదలడం లేదు. 2024 జూలై 31(నేటి)తో ఆ అధికారికి పొడిగించిన పదవీ కాలం కూడా ముగుస్తుంది. అయితే, మళ్లీ అక్కడే తిష్ట వేసేందుకు ప్రయత్నిస్తున్న ఆ అధికారి పైరవీలు షురూ చేశాడు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఆ అధికారి సర్వీసును ప్రభుత్వం పొడిగిస్తుందా లేక సాగనంపుతుందా అనేది మాత్రం నేటితో తేటతెల్లం కానుంది. ఆ అధికారి పేరు సత్యనారాయణ. జలమండలిలో ఈడీ (ఎగ్జిక్యూ టివ్ డైరెక్టర్)గా సేవలు అందిస్తున్నారు.
ఐఏఎస్ పోస్టులో ఈఎన్‌సీ..
జలమండలి ప్రధాన బాధ్యతలైన ఎండీ సహా ఈడీ పోస్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్, గ్రూప్ స్థాయి అధికారులను నియ మిస్తుండేది. కానీ గత ప్రభుత్వం 2015లో జలమండలి ఈడీ పోస్టుకు మాత్రం ఈఎన్‌సీ(ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా)గా ఉన్న సత్య నారాయణను నియమించింది. ఆయన పదవీ విరమణ వయసు 2016లో పూర్తయినప్పటికీ ఈడీగా కొనసాగిస్తూ వచ్చింది. గత ప్రభుత్వంలో ఆయన ఏడేళ్లు ఈడీగా కొనసాగగా, ఈ ప్రభుత్వంలోనూ సంవత్సరం కావస్తోంది. గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ఈ నెలాఖరుతో ముగుస్తుండడంతో మరోసారి సత్యనారాయణనే ఈడీగా కొనసాగించాలనే ఫైల్, విన్నపం ఇప్పటికే ప్రభుత్వానికి చేరినట్లు పలువురు చర్చించుకుంటు న్నారు.
దీంతో మరోమారు ఎక్స్‌టెన్ష న్ చేస్తారని జోరుగా చర్చ జరుగుతోంది. అయితే, ఎక్స్‌టెన్షన్‌లో విధులు నిర్వహిస్తున్న అధికారుల ను తొలగిస్తామని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆ ప్రకారం పలువురిని బాధ్యతల నుంచి తొలగించారు. కానీ హైదరాబాద్ జలమండలి సహా పలు శాఖల్లోని పలువురు అధికారులు ఎక్స్‌టెన్షన్‌పై విధు లు నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఇదేం న్యాయమని పలువురి ఆవేదన..
జలమండలిలో జూన్, జూలై నెలల్లో కలిపి దాదాపు ఐదుగురు డైరెక్టర్లు రిటైర్డ్ అయ్యారు. ఎక్స్‌టెన్షన్ కోసం ఒకరిద్దరు ప్రయత్నాలు కూడా సాగించారని, కానీ అవి సఫలం కాలేదని తెలుస్తోంది. దీంతో కొందరికి ఒక న్యాయం.. తమకు మరో న్యాయ మా అని వారు విమర్శిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, జలమండలి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ నేప థ్యంలో సీనియర్ ఈఎన్‌సీ అయిన ఈడీ సత్యనారాయణను ప్రభుత్వం కొనసాగిస్తున్నట్లు ప్రచారం ఉన్నప్పటికీ, జలమండలిలో ఆయన తప్ప మరొకరు లేరా అని పలువురు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. పదవీ విరమణ చెందాల్సిన వ్యక్తి తమపై అజమాయిషీ చేస్తున్నారని, ఈడీగా మరొకరికి అవకాశం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.