calender_icon.png 13 January, 2025 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంట్రాక్ట్ శిక్ష ఇంకెన్నాళ్లు?

26-12-2024 12:00:00 AM

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా ల వ్యాప్తంగా సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) పథకం ద్వారా పని చే స్తున్న ఉద్యోగులుగత రెండు వారాలుగా సమ్మె చేస్తున్నా వారిని పిలిచి చర్చలు జరి పి సమ్మె విరమింప చేయాల్సిన ప్రభుత్వం కాలయాపన చేస్తూ తమకేమీ పట్టనట్లు ్ల వ్యవహరిస్తోంది. కేజీబీవీ పాఠశాలల్లో 20 వేలు, జిల్లా,మండల ఎంఆర్‌సీ కార్యాలయాల్లో  18 వేల మంది కాంట్రాక్టు  పద్ధ తిలో విధులను నిర్వహిస్తున్నారు. అందరికీ నాణ్యమైన ప్రాథమిక విద్యను అం దించే కార్యక్రమం సమగ్ర సర్వశిక్షా అభియాన్. మానవ సమాజ సామర్థ్యాల ను మెరుగుపరచడానికి పిల్లలందరికీ పూర్తి స్థాయిలో గుణాత్మకమైన విద్య అందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా పథకాన్ని అమలు చేస్తున్నాయి. 

గంటలకొద్దీ వెట్టిచాకిరీ

మండల  విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మండల విద్యా వనరుల కేంద్రం సమగ్ర శిక్షా అభియాన్ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు కుదుర్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు, ఒప్పంద పద్ధతిలో కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంఐఎస్ కో- ఆర్డినేటర్లు, ఐఆర్‌పీలు, సీఆర్‌పీలు, పీటీలు, కేజీబీవీలో (సీఆర్‌టీ) ఉపాధ్యాయులు, యూఆర్‌ఎలలో ఉద్యోగులను నియమించాయి. సమగ్ర సర్వశిక్షా అభియాన్‌లో మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఆర్‌సీ )లో ప్రధానంగా పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు కీలక బా ధ్యతలు నిర్వహిస్తారు.

కంప్యూటర్  డేటా ఎంట్రీ ఆపరేటర్లు లేకపోతే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఎలాంటి సమాచా రం అందదు. వీరు కంప్యూటర్ ముందు గంటల కొద్దీ కూర్చోని బీపీ, షుగర్ వంటి జబ్బులకు తోడు పైఆధికారుల ఒత్తిడికి గురవుతున్నా పని చేసుకుంటూనే పోతా రు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు పండుగలు, సెలవులలో కూడా నిరంతరం కార్యాలయానికి సమాచారం అందించాలన్నా,అక్కడి నుండి సమాచారం తీసుకో వాలన్నా  ముఖ్య పాత్ర పోషిస్తున్నప్పటికీ పనికి తగిన ప్రతిఫలం లేకుండా పోతోంది.

తక్కువ జీతాలతో కుటుంబాన్ని పోషించలేక ఆర్థికంగా నానా ఇబ్బందులు పడు తూ విధులు నిర్వహిస్తున్నారు. అలాగే క్ల స్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్‌పీ ) యాజమా న్యం సమాచారం సమన్యాయం కర్తలు (ఎమ్‌ఐఎస్ కోఆర్డినేటర్లు) మండల విద్యాశా ఖ అధికారి కార్యాలయంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. మండల విద్యాశాఖ అధికారి పని విభజనలో భాగంగా మండలాల్లో ఐదారు గ్రామాల పాఠశాలలను క లిపి ఒక క్లస్టర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షకులుగా ఉంటారు. వారి పరిధిలో సీఆర్‌పీ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ ఉంటారు.

కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సీఆర్‌పీలు  రెండు, మూడు రోజుల ఒకసా రి తప్పకుండా పాఠశాలలను సందర్శిస్తుంటారు. ఆ పాఠశాలను సందర్శించిన తరు వాత పాఠశాలలో ప్రతి సమాచారం తెలుసుకొని మండల విద్యాశాఖ అధికారులకు సమాచారం అందిస్తున్నారు.  సమగ్ర సర్వశిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న క్లస్టర్ రిసో ర్స్ పర్సన్‌లను పాఠశాలలో నిర్వహించే స్కూల్ కాంప్లెక్స్ అజెండా తయారు చేసి సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని అధికారులు ఒత్తిడి చేస్తుంటారు. 

సమగ్ర సర్వశిక్ష అభియాన్ లోని ఐఆర్‌పీలు మండలంలోని గ్రామాలకు చెందిన దివ్యాంగుల విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్పిస్తూ వారి జీవితాలను బంగారు భవిష్యత్తు చేస్తున్నప్పటికీ సరైన గుర్తింపు లే కుండా పోతోంది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఒప్పందంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతిలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ) లో కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ (సీఆర్‌టీ) లను నియమించారు.

అందరికీ పూర్తి స్థాయిలో మె రుగైన, నాణ్యమైన ఉచితంగా విద్య అం దించాలనే దృఢ సంకల్పంతో సమగ్ర సర్వశిక్ష అభియాన్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ష్ఠాత్మకంగా చేపట్టిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అమ్మాయిలు చదు వులకు స్వస్తి పలకకుండా గత రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక చొరవతో ఉదయం టిఫిన్ , మధ్యాహ్నం, రాత్రి సన్నబియ్యం తో రెం డు పూటలు భోజనం అందించిన ఘనత గత ప్రభుత్వానికి దక్కింది.  ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్‌లు అందించి అమ్మాయిలను విద్యలో ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలకమైన పాత్ర పోషించారు.

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా..

 సమగ్ర సర్వ శిక్షా అభియాన్ పథకం కింద పని పనిచేస్తున్న వారికి ప్రభుత్వ ఉ పాధ్యాయులతో సమానంగా వేతనాలు పెంచాలని, పేస్కేల్, ఉద్యోగ భద్రత,  జీవి త బీమా, హెల్త్ కార్డులు, సమాన పనికి సమాన వేతనం అందించాలని ఈ నెల 10 నుంచి ఎంఆర్‌సీ కార్యాలయానికి తా ళం వేసి నిరవధిక సమ్మె చేస్తుంటే ప్రభు త్వం స్పందించకపోవడం దారుణం . సమ గ్ర సర్వ శిక్షాఅభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం , రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వేతనం అమలు చే స్తున్నారు.

ఇందులో దాదాపు 38,000 వేల మంది ఉపాధ్యాయులు , ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని స్పష్టంగా చె ప్పవచ్చు.  కేంద్ర ప్రభుత్వం 2004లో  దే శవ్యాప్తంగా సుమారు 4,982 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) పాఠశాలలు ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 479 పాఠశాలలు ఏ ర్పాటు చేశారు. వీటిలో 316 స్కూళ్లలో  ఇంటర్మీడియట్ విద్యను బోధిస్తున్నారు.

కేజీబీవీ పాఠశాలలో సుమారు దాదాపు 1,25,000 పైగా విద్యార్థినులు చదువుతున్నారు.  సుమారు 20,000 వేల మంది బోధన, బోధనేతర ఉద్యోగులు ఉన్నారు. వీరందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయిస్తూ అరకొర జీతం అందిస్తున్నారు. పార్ట్ టైం, ఇన్‌స్ట్రక్ట ర్ ఒప్పంద  ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉ పాధ్యాయులతో సమానంగా విధులు నిర్వహిస్తారు. చాలీచాలని జీతాలు ఇస్తు న్నా పర్మినెంట్ అవుతుందన్న ఆశతో, న మ్మకంతో వారు బాధ్యతతో విధులు నిర్వహిస్తున్నారు.

 సీఎం హామీని నిలబెట్టుకోవాలి

నిరవధిక సమ్మె చేస్తున్న వీరికి విద్యార్థి, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నాయకు లు, రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చి అం డగా నిలుస్తున్నారు. కానీ  రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించేందుకు వెనకడుగు వే స్తున్నదని వీరు ఆందోళన చెందుతున్నా రు. గత 18 సంవత్సరాల నుండి చాలీ చా లని వేతనాలతో,ఇకనైనా రెగ్యులర్ కాదా అనే ఆశతో ఎదురు చూస్తున్నామని వాపోతున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ 13 న పీసీసీ అధ్యక్షుడి హోదాలో హన్మకొండ జిల్లా ఏకశిలా పార్కు వద్ద సమగ్ర సర్వశి క్షా ఉద్యోగులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని సం దర్శించి, సంఘీభావం ప్రకటించి,  కాంగ్రె స్ పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజు ల్లో  మీకు సరైన న్యాయం చేసి మీ అందరికీ పర్మినెంట్ చేస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకొ ని  తమకు సరైన న్యాయం చేయాలని స మగ్ర శిక్షా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నా రు. సమగ్ర శిక్షాఉద్యోగులకు పే స్కేల్, జీవి త బీమా, ఆరోగ్య బీమా, హెల్త్ కార్డులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మరణించిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, పార్ట్ టైం ఉద్యోగు లను ఫుల్ టైం ఉద్యోగులు గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అదే వి ధం గా సమాన పనికి సమాన వేతనం, ఇతర ప్రభుత్వ మహిళ ఉద్యోగులు మాదిరిగా స ర్వశిక్షాఅభియాన్ మహిళా ఉద్యోగులకు అన్ని రకాల సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం మానవతాదృక్పథంతో ఆలోచించి సమగ్ర సర్వ శిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు , ఒప్పంద ఉ ద్యోగులను పర్మినెంట్ చేసి, ప్రభుత్వ ఉ ద్యోగులతో సమానంగా ఆదుకొంటుందని వీరంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.