- * వారానికి 90 గంటలు పనిచేయాల్సిందే..
- * అవసరమైతే ఆదివారాలు కూడా వదులుకోవాలి
- * ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- * మండిపడుతున్న నెటిజన్లు
న్యూఢిల్లీ, జనవరి 9: దేశంలోని యువత వారానికి 90 గంటలు పనిచేయాలని, అవసరమైతే ఆదివారాలను సైతం వదులుకోవాల ని ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్య న్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారా యి. ఇంకా ఆయన ఏమన్నారంటే..“ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు.. ఇంట్లో తక్కువ సమయం, ఆఫీస్‌లో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలి..” అంటూ హితువు పలికారు.
ఆదివారాలు ఉద్యోగులతో పనిచేయించలేకపోతున్నందుకు బాధపడుతున్నట్లు, వారితో అలా పనిచేయించగలిగితే ఎంతో సంతోషమన్నారు. తాను ఆదివారాలు సైతం పనిచేస్తానని చెప్పుకొచ్చారు. సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనే స్పందించారు. సమాజంలో ఉన్నంతమైన వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూసి షాకైనట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ఇది మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయమని అభిప్రాయపడ్డారు. కొద్ది రోజుల కింద ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వారానికి 70 గంటల చొప్పున పనిచేయాలంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలని సూచించారు. నారాయణమూర్తి వ్యాఖ్యలపై కూడా అప్పట్లో సైతం విభిన్న స్పందనలు వెల్లువెత్తాయి.