calender_icon.png 17 March, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడవుల నరికివేత ఇంకెంత కాలం?

16-02-2025 12:00:00 AM

భూమి మీద నివసిస్తున్న సమస్త జీవులకు జీవనాధారంగా దోహదపడేది స్వచ్ఛమైన గాలి. స్వచ్ఛమైన గాలి అనేది లేకపోతే మానవా ళి మనుగడకు పెద్ద ప్రమాదంగా మారుతుంది.

కేవలం స్వచ్ఛమైన గాలి కాకుండా ఎంతో సంపదతో కూడుకున్న అడవిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉంటుంది. అయితే అంతరిస్తున్న అడవులను ప్రభుత్వాలు రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది.                                              

భారతదేశంలో అటవీ సంరక్షణ ఒక ముఖ్యమైన గ్రామీణ పరిశ్రమ, ఒక ప్రధా న పర్యావరణ వనరు. భారత్ ప్రపంచంలోని అత్యంత అటవీ సంపన్న పది దేశా లలో ఒకటి. భారతదేశం, 9 ఇతర దేశాలు కలిసి ప్రపంచంలోని మొత్తం అటవీ ప్రాం తంలో 67 శాతం వాటాను కలిగి ఉన్నా యి. భారతదేశంలోనే అతిపెద్ద అటవీ విస్తీర్ణం మధ్యప్రదేశ్‌లో ఉంది.

అరుణాచల్ ప్రదేశ్ దేశంలో 2వ అతిపెద్ద అటవీ ప్రాం తాన్ని కలిగి ఉంది . 2010 నాటికి, ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ భారతదేశ అటవీ విస్తీర్ణం దాదాపు 68 మిలియన్ హెక్టార్లుగా లేదా దేశ విస్తీర్ణం లో 22 శాతంగా అంచనా వేసింది. 2013 ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, ఉపగ్రహ కొలతల ప్రకారం, 2012 నాటికి దాని అట వీ విస్తీర్ణం 69.8 మిలియన్ హెక్టార్లకు పెరిగింది.

అయితే ఈ లాభాలు ప్రధానంగా ఉత్తర, మధ్య , దక్షిణ భారత రాష్ట్రాలలో ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలు 2010 నుండి 2012 వరకు అటవీ విస్తీర్ణంలో నికర నష్టాన్ని చవిచూశాయి.

విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ ప్లాంట్లను విస్తరించడానికి ప్రధా న, వేగవంతమైన, నిరంతర ప్రయత్నం చేయకపోతే, దేశంలోని గ్రామీణ ,పట్టణ పేదలు అడవులను స్థిరంగా నాశనం చేయడం, ఇంధన కలప వినియోగం ద్వారా తమ ఇంధన అవసరాలను తీర్చుకోవలసి ఉంటుంది.

దేశంలో కలపేతర అటవీ ఉత్పత్తుల పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. భారతదేశంలో అటవీ పరిశ్రమ నుండి వచ్చే మొత్తం ఆదాయంలో దాదాపు 50 శాతం కలపేతర అటవీ ఉత్పత్తుల వర్గంలో ఉంది. 

సుప్రీంకోర్టు తీర్పును పాటించాలి

జాతీయ అటవీ విధానం ప్రకారం  అడవులు 33 శాతం చేరుకోవడానికి ముమ్మర కృషి జరగాలి. చెట్ల సంరక్షణకు సోయిలేని ప్రభుత్వాలు విచ్చలవిడిగా నరికివేతను ప్రోత్సహిస్తే ఎలా? ప్రకృతి పరి రక్షణకు  చెట్ల పెంపకం పౌర సమాజ బాధ్యత కూడా! ప్రపంచవ్యాప్తంగా 25 శాతం జనాభా ప్రత్యక్షంగా అడవుల పైన ఆధారపడి జీవిస్తున్న విషయాన్ని  పౌర సమాజం గుర్తించాలి.

ప్రపంచంలో జీవిం చే 80 శాతం జంతువులకు అడవులే నివా సం. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకున్నప్పుడు పౌర సమాజంతో పాటు పాలకుల కు కూడా చెట్లను రక్షించవలసిన బాధ్యత  ఎంతో ఉన్నది. కానీ ఆచరణలో  నిర్లక్ష్యం, చట్టాల ఉల్లంఘన, సోయిలేకుండా వ్యవహరించడాన్ని దశాబ్దాలుగా మనం చూస్తు న్నాం.

దేశంలో అడవుల విస్తీర్ణం 78.9.2  మిలియన్ హెక్టార్లలో  ఉంటే  దేశ భౌగోళిక విస్తీర్ణంలో దాని శాతం  24 మాత్రమే.  చట్టాలలో లొసుగులు, పాలకుల నిర్లక్ష్యం అభివృద్ధి పేరుతో చెట్ల నరికివేత  కొనసాగడం పైన అన్ని వర్గాలు దృష్టి సారించవల సిన అవసరం ఉంది. 

ఇదే అంశం పైన అభివృద్ధి పనులకు ఆటంకాలుగా చెట్లు పరిణమించాయని వాటిని కొట్టి వేయడానికి అనుమతులు ప్రభుత్వాలు కోరిన సందర్భంలో ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 ఏ ప్రకారంగా పౌర బాధ్యతలను గుర్తు చేస్తూ  అనివార్యమైతే తప్ప చెట్టును నరికి వేయకూడదని,  నరికివేతను చాలా తగ్గించాలని ఆదేశించడం గమనార్హం .

చెట్లను నరికి వేయడం ప్రకృతికి ఎంతో నష్టమని ఇప్పటికీ మనిషి గుర్తించకపోవడం విచారకరం . ముఖ్యంగా అభివృద్ధి , రహదారులు, విద్యుత్ తీగలు,  భవనా లు, ఇతర నిర్మాణాలకు ఆటంకం అనే పేరుతో పెట్టిన చెట్టుని మళ్లీ నరికి వేస్తూ  ప్రకృతికి ద్రోహం చేస్తున్న విషయం అందరికీ తెలుసు. 

‘చెట్లను పెంచాలి అడవులను సంరక్షించాలి’ అని నినాదాలు ఇవ్వడమే కానీ  అనేక చోట్ల ప్రభుత్వాలు మొక్కలు నాటిన  ప్రాంతాలలో నామరూపాలు లేకుండా పోయిన సందర్భాలు గమనిస్తు న్నాం. 

కానీ  ఫిలిప్పీన్స్‌లో  ప్రతి విద్యార్థి పట్టభద్రుడు అయ్యే లోగా కనీసం 10 మొక్కలను విధిగా నాటి పెంచాలని అక్కడి ప్రభుత్వం నియమం విధించినట్లుగా తెలుస్తుంది. ఆ దేశాన్ని ఆదర్శంగా తీసుకుని భారత దేశంలో  నరికివేతను అడ్డుకోవడానికి గల అవకాశాలను అన్వేషించవలసిన అవసరం ప్రతి వ్యక్తి పైన ఉన్నది. 

దేశంలో చెట్ల నరికివేతకు సంబంధించి దాదాపుగా అన్ని  రాష్ట్రాలలో ఒకటే ధోరణిని మనం గమనించవచ్చు  ఉదాహరణ కు తెలంగాణలో 2015 నుంచి 2019 మధ్యకాలంలో  ఏడాదికి లక్షన్నర చొప్పున  మొత్తం 6, 65,396 చెట్లను ప్రభుత్వ అనుమతితోనే నరికినట్లుగా తెలుస్తుంది.  కానీ వాస్తవానికి  పెద్ద మొత్తంలో చెట్లను నరికి వేయవలసి వచ్చినప్పుడు  ప్రభుత్వాలు న్యాయవ్యవస్థ  అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది.

క్వారీల నిర్వహణ,  నూత న మార్గాలు, రైల్వే లైన్లు  వేస్తున్న సందర్భంగా  దేశ వ్యాప్తంగా సుమారు 23 లక్ష ల చెట్లను కొట్టేయవలసిన అవసరం ఉన్నదని 2023లో  ప్రభుత్వం రాజ్యసభలో ప్రకటించింది. ఇక 2001 నుండి 23 మధ్యకాలంలో  దేశంలో సుమారు 58 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న లక్షలాది వృక్ష సంపదకు నష్టం వాటిలినట్లుగా ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి .

పెన్సిళ్ల తయారీకి సంబంధించి సంవత్సరానికి 80 లక్షల పైగా చెట్లు నరికివేత గురవుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. కాఫీ తోటల విస్తరణ కోసం కర్ణాటకలో భారీగా పెరిగిన చెట్లకు విషపు ఇంజక్షన్ ఇచ్చి తొలగిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తే  కంటతడి పెట్టవలసి ఉంటుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

కనీస చర్యలు 

సామాజిక అడవులను ప్రభుత్వ భూములలో విస్తారంగా పెంచడం,  మొక్క ల పెంపకం సందర్భంలోనే  స్థలాలను సరిగా ఎంపిక చేయడం, సాధ్య మైనంత వరకు తక్కువ నష్టంతో ప్రత్యామ్నాయ అవసరాలను తీర్చాలి.

ప్రభుత్వా లు పౌర సమాజానికి కూడా అడవుల సం రక్షణ పట్ల బాధ్యతను గుర్తింప చేయడం, చెట్లు  అడవుల యొక్క ప్రాధాన్యతను  విస్తారంగా జన జీవితంలో ప్రచారం చేయడం ద్వారా సాధ్యనంతవరకు అడవుల నరికివేతను తగ్గించాలి.

ప్రతి వ్యక్తి విధిగా చెట్లు పెట్టాలి అనే నినాదాన్ని ఇంటింటా ప్రచారం చేసి  ఫిలిప్పీన్స్  ఆనవాయితీని  ప్రతి కుటుంబంలోని సభ్యులు అమలు చేయగలిగితే అవసరానికి నరికి వేసినప్పటికీ అంతకు మించిన స్థాయిలో వనరక్షణ సాధ్యమవుతుంది. ఒక చెట్టును నరికితే 10 మొక్కలు నాటాలి అనే నినాదాన్ని అమలు చేయడమే దీనికి పరిష్కార మార్గం.