calender_icon.png 17 March, 2025 | 12:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రమబద్ధీకరణ ఎదురుచూపులు ఎన్నాళ్లు?

14-12-2024 12:00:00 AM

పదహారేళ్ల్లుగా విద్యాశాఖలో ము ఖ్యమైన పాత్ర పోషిస్తూ ప్రభుత్వానికి, ఉపాధ్యాయులకు, సమాజానికి మధ్య వారధులుగా ఉంటూ విద్యాశాఖలో ని వివిధ విభాగాల నడుమ సమన్వయానికి నిరంతరం కృషి చేస్తున్న ఉద్యోగులు తెలంగాణలో 19,325 మంది ఉన్నారు. వీరిలో సిస్టం అనలిస్టులు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, టెక్నికల్ పర్సన్స్ సీసీఓలు, పీఆ ర్పీలు, అకౌంటెంట్లు ఏపీవోలు, ఎస్‌ఓలు బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధాన పరమైన నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో వీరు చాలా కీలకం. ఈ ఉద్యోగులు అందరూ కూడా కాంట్రాక్టు ఉద్యోగులే కాక శ్రమ దోపిడీకి గురవుతున్నవారే. వీరంతా విద్యాశాఖలో రెగ్యులర్ ఉద్యోగులకన్నా అధికంగా పని చేస్తూ అతి తక్కువ వేతనం పొందుతూ, దుర్భర జీవితం గడుపుతున్నారు. సమాన పనికి సమాన వేత నం ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చి న తీర్పును గత, ప్రస్తుత పాలకులు విస్మరిస్తున్నారు.

గడచిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని మాటి చ్చి క్రమబద్ధీకరణ చేయలేదు. కనీసం మినిమం టైం స్కేల్ కూడా ఇవ్వలేదు. 

తర్వాత కాలంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల మేని ఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఏర్పడి ఏడాది గడిచినా తమ సమస్యలను పట్టించుకోవట్లేద ని వారు వాపోతున్నారు. సమగ్ర శిక్షాలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ ఈ నెల 10 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు. తెలంగాణ రాష్ట్ర  విద్యాశాఖలో స్పెషల్ ఆఫీసర్లు మొదలుకొని వివిధ విభాగాల్లో ఇలాంటి ఉద్యోగులు మొత్తం 19,325 మంది ప్రస్తుతం పనిచేస్తున్నారు.

దేశంలో బడుగు, బలహీన వర్గాల బాలికలకు నాణ్యమైన విద్యను అందించడం కోసం రెసిడెన్షియల్ పద్ధతిలో బోధించడానికి 2004 జూలైలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినవే కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు. వీటి నిర్వహణకు అ య్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం 65 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం భరిస్తాయి.

సమాన పనికి సమాన వేతనం ఇవ్వరా?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల లో 479 కేజీబీవీలు, 29 అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు  ఉన్నాయి (హైదరాబా ద్, మేడ్చల్ జిల్లాలు మినహాయించి). కేజీబీవీ, యూఆర్‌ఎస్‌లలో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది అందరూ కాంట్రాక్టు ఉద్యోగులే. తెలంగాణ ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమ ఆవశ్యకతను గుర్తించి 2017 విద్యా సంవత్సరం నుండి 84 కేజీ బీవీలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టా రు.

అలాగే, దేశంలోనే మొదటిసారిగా కేజీబీవీలను ఇంటర్మీడియట్ స్థాయికి అప్‌గ్రే డ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేజీబీవీలలో ప్రతి సంవత్సరం విద్యార్థుల నమో దు గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఆంగ్ల మాధ్యమం అందుబాటులోకి రావ డం, నాణ్యమైన పౌష్టికాహారం విద్యార్థులకు అందించడం, రెసిడెన్షియల్ పద్ధతిలో విద్యాబోధన చేయడం వంటివాటివల్ల బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుతున్నది.

ప్రతి సంవ త్సరం కేజీబీవీ నుంచి ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. ఇందులో ఉద్యోగ, ఉపాధ్యాయుల పాత్ర హర్షణీయం. నాణ్యమైన విద్యతోపాటు జీవితంలో విద్యార్థులకు ఉపయోగపడే వృత్తి విద్యను, కుట్లు అల్లికలు, బ్యూటీషియన్, కరాటే, కంప్యూటర్ వంటివికూడా కేజీబీలలో నేర్పుతున్నారు.

అయితే, ఎన్నో ఏండ్లుగా కేజీబీవీ ఉద్యోగులకు కనీస వేతనాలు లేక శ్రమ దోపిడీకి గురవుతున్నారు. కష్టపడి పనిచేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న వీరికి ప్రోత్సాహం కరువైంది. స్పెషల్ ఆఫీసర్ల నుంచి వర్కర్ల వరకు అందరూ శ్రమ దోపిడీకి గురవుతున్న వారే. 

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఉన్న దృష్ట్యా పనిచేస్తున్న ఉద్యోగులకు వారి పోస్ట్‌కు అనుగుణంగా కనీసం బేసిక్ పే ఇవ్వాలనేది వీరి ప్రధానమైన డిమాండ్. ఉద్యోగులకు రూ.10 లక్షల జీవిత బీమా, రూ.10 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలని, ఉద్యోగ విరమణ సమయంలో రూ.25 లక్షల బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వ, విద్యాశాఖ నియామకాల్లో వీరికి వెయిటేజీ ఇవ్వాలని, ప్రతి సంవత్సరం కనీసం ఒక ఇంక్రిమెంట్ ఇవ్వాలని, హాస్టల్ నిర్వహణ కోసం కేర్ టేకర్‌ను నియమించాలని, అందరికీ హెల్త్ కార్డులు ఇచ్చి నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని ఇలా వీరు కోరుకుంటున్న పరిష్కారాలు ఎన్నో.

దేశం లో ఒడిశా, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్రల లో ఈ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరిగింది. మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్ర దేశ్‌లో మినిమం టైం స్కేల్ ఇస్తున్నారు. మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతిలో నియామకమైన వీరి క్రమబద్ధీకరణకు న్యాయపరమై న అడ్డంకులు కూడా లేవు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా కాంగ్రెస్ ప్రభు త్వం తమను తప్పకుండా రెగ్యులరైజ్ చేస్తుందని, తమ సమస్యలను పరిష్కరిస్తుందని విద్యాశాఖలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

- పాకాల శంకర్ గౌడ్