గృహ నిర్బంధంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్
ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శిస్తానని వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 20 (విజయక్రాంతి): పోలీసులు తన ను మరోసారి గృహ నిర్బంధంలో ఉం చారని, ఇలా ఎంతకాలం అణచివేయడానికి ప్రయత్నిస్తారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు. తనను హౌస్ అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులతో మాట్లాడుతున్న వీడియోను ఆది వారం ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసిన ఆయ న సంచలన వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తనను ఎందుకు అడ్డుకుంటోందని ప్ర శ్నించారు. దారుస్సలాం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రభు త్వం తనను మౌనంగా ఉంచుతోందా అని నిలదీశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అతి త్వరలో ఆలయాన్ని సంద ర్శించి ముత్యాలమ్మ ఆశీస్సులు పొందుతానని రాజా సింగ్ స్పష్టం చేశారు.