calender_icon.png 4 January, 2025 | 5:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ పయనమెటు?

02-01-2025 01:58:47 AM

  1. మొదట అద్దె బస్సులు.. తర్వాత బడా కంపెనీ బస్సులు
  2. ఇప్పుడు మహిళా సంఘాలకు ఎలక్ట్రిక్ బస్సులు 
  3. 4,235 కోట్ల ఆదాయం వస్తే.. సొంత బస్సులు కొనొచ్చు కదా
  4. ఈవీ పేరిట ప్రైవేటీకరణకు కుట్ర జరుగుతోందని కార్మికుల ఆరోపణ

హైదరాబాద్, జనవరి 1 (విజయ క్రాంతి): ఒకప్పుడు ఆర్టీసీలో ఉద్యోగం అంటే గొప్పగా చెప్పుకొనేవారు. కార్పొరే షన్ అయినా ఉద్యోగ భరోసాతో కార్మి కులు సంతోషంగా విధులు నిర్వర్తించే వారు. గత కొంత కాలంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు కార్మికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

మొదట అద్దె బస్సులను తీసుకొచ్చిన ఆర్టీసీ.. తర్వాత ఈవీ బస్సుల పేరిట ప్రైవేటు కంపెనీలకు బస్సులను కట్టబెడుతోంది. ఇప్పుడు మహిళా సంఘాల పేరిట ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువ స్తోంది. తద్వారా సంస్థకు సొంత బస్సు లు తగ్గిపోతున్నాయని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు.

ఏదో ఒక రూపంలో ఆర్టీసీ బస్సులను పూర్తిగా తొలగించి సంస్థను ప్రైవేటీకరించే కుట్ర జరుగు తోందని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు అద్దె బస్సులను ప్రవేశపెట్టి ఆర్టీసీని సగం ఆగం చేశారని.. ఈవీ బస్సుల ముసుగులో ఇప్పుడు పూర్తిగా ఆర్టీసీని రూపుమాపేందుకు చూస్తున్నా రని కార్మికులు మండిపడుతున్నారు.

ఆర్టీసీ ఉనికికే ప్రమాదం 

రాష్ట్రంలో వాహన కాలుష్యాన్ని తగ్గిం చేందుకు ఆర్టీసీలో దశలవారీగా ఈవీ బస్సులను ప్రవేశపెట్టేందుకు సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలో ఉన్న మొత్తం మూడు వేల ఆర్టీసీ బస్సులను దశలవారీగా తొల గించి పూర్తిగా ఈవీ బస్సులనే ప్రవేశపెడతామని ప్రభుత్వం ప్రకటిం చింది.

ఇక్కడే తమ ఉద్యోగ భద్రతపై పెను ప్రభావం పడుతోందని ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. ఒక్క బస్సుకు ఐదుగురు చొప్పున ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు ఉంటాయి. అంటే 3 వేల ప్రైవేటు ఈవీ బస్సులను తీసుకువస్తే ఒక్కో బస్సుకు కండక్టర్‌ను మినహాయిస్తే నలుగురు చొప్పున ఉద్యోగాలు కోల్పో వాల్సి వస్తుంది.

అంటే దాదాపు 12 వేల మంది కార్మికులకు ఆర్టీసీలో పని చేసేందుకు అవకాశం ఉండదు. బస్సులు లేనప్పుడు కార్మికుల అవసరం కూడా ఉండదు. దీన్ని బట్టి చూస్తే ఆర్టీసీ యాజ మాన్యం, సర్కారు చేస్తున్న ఆలోచనల ప్రకారం భవిష్యత్తులో ఈవీ బస్సులు పెరిగితే ఆర్టీసీ కార్మికుల అవసరం తగ్గిపోతుంది.

ఒక్క ప్రైవేటు ఈవీ బస్సు వచ్చిందంటే కండక్టర్‌ను మినహాయిస్తే నలుగురి ఉద్యోగాలు ప్రమాదంలో పడినట్లేనని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. 

పెరుగుతున్న ప్రైవేటు ఈవీ బస్సులు 

హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లో ప్రభుత్వ సహకారంతో 251 ఈవీ బస్సులను ప్రవేశపెట్టినట్టు రవాణా శాఖ మంత్రి కార్యాలయం ప్రకటించింది. కానీ, ఈ ఈవీ బస్సుల కొనుగోలులో ప్రభుత్వ పాత్ర ఏంటో స్పష్టంగా చెప్పలేదు. గ్రేటర్‌లో పరిధిలో ఒలెక్ట్రా సంస్థ.. నిజామాబాద్, కరీంనగర్ డిపోల పరిధిలో జేబీఎం సంస్థ ఈవీ బస్సులను నడుపుతుంది.

ఇందులో ప్రభుత్వ సహకారం ఏమిటనేది అటు ఆర్టీసీ యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ ప్రకటించలేదు. మార్చి 2025 నాటికి హైదరాబాద్‌లో 353, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ, సూర్యాపేటలో 446 ఈవీ బస్సులను ప్రవేశపెట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దశలవారీగా నగరంలో అన్నీ ఈవీ బస్సులే ఉంటాయని సర్కారు చెప్తోంది.

డిపోలను కూడా అప్పగిస్తున్నారు 

నగరంలో ఆర్టీసీని క్రమంగా ప్రైవేటీకరిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. గతంలో అద్దె బస్సులు ప్రవేశపెట్టినా వాటిని గమ్యస్థానాలకు తిప్పిన తర్వాత వాటి యజమాని తన పర్యవేక్షణలో ఉంచుకునేవాడు. అయితే ఈవీ బస్సులు బడా కంపెనీలకు చెందినవి. వాటికి నేరుగా ఆర్టీసీ డిపోలనే అప్పగిస్తున్నారని కార్మిక సంఘాలు తెలిపాయి.

ఇప్పటికే నగరంలోని మియాపూర్, హెచ్‌సీయూ, కంటోన్మెంట్ డిపోలను ఒలెక్ట్రా కంపెనీ వాళ్లకు అప్పగించారని, అక్కడ ఆర్టీసీ బస్సులను పూర్తిగా తొలగించి ఈవీ బస్సులను ప్రైవేటు కంపెనీ డిపో నిర్వహిస్తోందని చెప్తున్నారు. ఆర్టీసీ బస్సులను వేరే చోటుకు తరలిస్తూ పూర్తిగా ఈవీ బస్సులతో డిపోలను నింపేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.

ప్రైవేటు ఈవీ బస్సులకు ఆర్టీసీ నుంచి ఒక్క కండక్టర్ మినహా వేరెవరూ పనిచేయరు. అంటే భవిష్యత్తులో నగరంలో అన్నీ ఈవీ బస్సులే వస్తే ఆర్టీసీ కండక్టర్లు మినహా డ్రైవర్లు, మెకానిక్‌లు, ఇతర సిబ్బంది అవసరమే ఉండబోదు. అటు తిప్పి ఇటు తిప్పి చివరకు ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలకే ఎసరొస్తుంది.  

మహిళా సంఘాలకు 150 ఈవీ బస్సులు

ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆర్టీసీ కార్మికులు.. మహిళా సంఘాలకు 150 ఈవీ బస్సులు కేటాయిస్తామంటూ సర్కారు పేర్కొనడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒలెక్ట్రా, జీబీఎం పోయి ఇప్పుడు మహిళా సంఘాలు వచ్చి తమ ఉద్యోగాలకు ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ వాపోతున్నారు.

మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులను నిర్వహించడం అంత తేలికైన పనికాదని, వారి పేరిట కొందరు ఈవీ బస్సులను ఆర్టీసీలో నడిపే కుట్ర జరుగుతోందంటూ ఆరోపిస్తున్నారు. బస్సులు అన్ని ప్రైవేటు వ్యక్తుల ద్వారా నిర్వహిస్తే ఇక ఆర్టీసీలో ఉద్యోగులకు పనేమి ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే క్రమంగా ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్ర నడుస్తోందని ఆరోపిస్తున్నారు.

లాభాల్లో ఉంటే సొంత బస్సులు కొనొచ్చు కదా

ఆర్టీసీలో ఏడాది కాలంలో మహిళలు ఉచితంగా 125.50 కోట్ల ప్రయాణాలు (ఇది జీరో టికెట్ల సంఖ్య) చేయడం ద్వారా సుమారు రూ. 4,225 కోట్లు ఆదా చేసుకున్నారని.. ఈ డబ్బు ను ఆర్టీసీకీ ప్రభుత్వం చెల్లించిందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని చెప్పారు.

లాభాల్లోకి వచ్చినప్పుడు ఆర్టీసీయే ఈవీ బస్సులు కొనుగోలు చేస్తే సరిపోతుందిగా? అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీలో ఒక్క కొత్త ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టలేదని, కనీసం కార్మిక సంఘాలకు గుర్తింపును కూడా పునరుద్ధరించలేదని కార్మికులు విమర్శిస్తున్నారు. 

మహిళా సంఘాల పేరిట బినామీలకు ఇచ్చే కుట్ర 

కాలుష్యం నివారించేందుకంటూ ఇప్పటికే రెండు బడా కంపెనీలకు ఈవీ బస్సులను కట్టబెట్టి ఆర్టీసీని ఆగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రైవేటు కంపెనీ లకు రాయితీలు ఇచ్చే బదులు మహాలక్ష్మి పథకం ద్వారా వచ్చిన ఆదాయంతో కొత్త ఈవీ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసికి ఇస్తే ఎంతో లాభం వస్తుంది. మహిళా సంఘాలు ఈవీ బస్సులను నిర్వహించడం సులభం కాదు.

మహిళా సంఘాల పేరిట తమ బినామీలకు ఈవీ బస్సులను కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. కాంగ్రెస్ సర్కారు వచ్చాక తమ జీవితాలు బాగు పడుతాయనుకుంటే ఇంకా నాశనం అవుతున్నాయి. ఆర్టీసీని బాగు చేస్తామంటూనే భూస్థాపితం చేసే ప్రయత్నం చేస్తు న్నారు. కాలుష్యం నివారించేందుకు ఆర్టీసీ లో ఈవీ బస్సులు ప్రవేశపెడితే సరిపోతుందా..

మిగతా వాహనాల కాలుష్యం ప్రభుత్వానికి కనిపించడం లేదా. కాలు ష్యం బూచీగా చూపిస్తూ ఆర్టీసీని ఖతం చే సేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఆర్టీ సీ జేఏసీ పోరాటం చేస్తుంది. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం తీరును వారికి తెలిసేలా చేస్తాం. 

 ఈదురు వెంకన్న, 

రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ చైర్మన్