calender_icon.png 9 February, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయే తెలంగాణ

09-02-2025 01:07:07 AM

* ప్రభుత్వ పాలనపై కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాం తి): దినదినగండంగా తెలంగాణ ఉందని.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా శనివారం స్పందించారు. “తొలి గండం దాటితే..తొంభై ఏండ్ల ఆయుష్షు.. అని పెద్దల మాట.

అల్లుడి కంపెనీల కోసం, అదానీ పరిశ్రమల కోసం, ఢిల్లీకి మూటల చేరవేత కోసం పేదల భూములు లాక్కునేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలను ప్రజలు ఎదుర్కొంటున్నారు..” అని ఆరోపించారు. “లాఠీల దెబ్బలు తిని, చేతులకు బేడీలు వేసుకొని, చెరసాలల పాలైనా భూములను చెరబట్టడంలో మాత్రం రేవంత్ ప్రభుత్వం పట్టువదలడం లేదు” అని విమర్శించారు.

“కాదేది అణచివేతకు అనర్హం కాదన్నట్టు తెలంగాణలో సాగుతున్న కాంగ్రెస్ పాలన.. పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఏడాది కాలంగా ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితి...ఎట్లుండె తెలంగాణ ఎట్లాయే తెలంగాణ” అని ట్వీట్‌లో రాసుకొచ్చారు.