calender_icon.png 21 September, 2024 | 5:35 AM

ఎఫ్టీఎల్ ఎలా నిర్ణయిస్తారు?

21-09-2024 01:27:25 AM

ఏ నిబంధన ప్రకారం చేస్తారో చెప్పండి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఏ నిబంధనల ప్రకారం చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్)ను నిర్ణయిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవా రం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఎఫ్టీఎల్ నిర్ధారించడానికి ఏవైనా చట్ట పరమైన నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులు ఉంటే సమర్పించాలని కోరింది. హైదరాబాద్‌లోని దుర్గం చెరువు 160 ఎకరాల విస్తీర్ణం ఉందని ఏ ప్రాతిపదికన నిర్ణయించారో కూడా చెప్పాలని ఆదేశించింది.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టబేగంపేట గ్రామం సర్వే నం.47లో అమర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఉన్న తన ప్లాట్‌లోని నిర్మాణాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ ఎల్ ఊర్మిళాదేవి అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పీ రాయ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ నీటిపారుదల శాఖలోని చెరువుల మ్యాప్ ప్రకారం దుర్గం చెరువు విస్తీర్ణం 65 ఎకరాలు మాత్రమే ఉందని చెప్పారు.

అధికారులు మాత్రం దుర్గం చెరువు 160 ఎకరా లు ఉన్నట్లు చెబుతున్నారని, దీనివల్ల ప్రైవే టు ఆస్తులన్నీ అందులోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చెరువుకు 50 మీటర్ల వరకు ఉన్న ప్రాంతం ఎఫ్టీఎల్‌గా ఉంటుందని, అయితే అక్కడ ప్రైవేటు భూమి ఉన్నట్లయితే భూసేకరణ చట్టం కింద సేకరించాల్సి ఉందని తెలిపారు.

ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఎలాంటి చట్టం అమలులో లేని పక్షంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రామాణికమవుతుందని వ్యాఖ్యానించింది. ఎఫ్టీఎల్ నిర్ధారణకు అనుసరించే పద్ధతులు, నిబంధనలు ఏవైనా ఉంటే చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేని పక్షంలో మార్గదర్శకాలు జారీచేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపిం ది. పూర్తి వివరాలను సమర్పించడానికిగాను ప్రభుత్వానికి గడువు మంజూరు చేస్తూ విచారణను 23వ తేదీకి వాయిదా వేసింది.

పబ్బుల్లో శబ్ద కాలుష్యంపై హైకోర్టు నోటీసులు 

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): పబ్‌లలో విపరీత శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నారంటూ వస్తున్న ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి రాయదుర్గ్‌ని రెడ్ రైనో పబ్, పోస్ట్ కార్డ్ రెస్టారెంట్, గ్లోబల్ తపస్ బార్లు విపరీతంగా శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నాయని, చుట్టు ఉన్న వారి ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నాయని హైకోర్టులో హైదారబాద్ బర్కత్‌పురాకు చెందిన ఆనంద్ పిటిషన్ దాఖలు చేశారు. పబ్‌లకు జారీ చేసిన అనుమతులను పూర్తిగా ఉల్లంఘించినందున, విచారణ జరిపి లైసెన్సు, అనుమతులు రద్దు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. అధికారులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణ వాయిదా వేసింది.

మోటార్ వాహన చట్టం అమలైతుందా?

  1. కొత్త నిబంధనల అమలుపై వివరణ ఇవ్వండి 
  2. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): మోటార్ వాహన చట్టం అమలుపై పూర్తి వివరాలు సమర్పించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శుక్ర వారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర రవాణాశాఖలతోపాటు రాష్ట్ర రవాణ శాఖ కమిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. 1988 మోటార్ వాహనాల చట్టాన్ని సవరిస్తూ 2019లో కేంద్రం కొత్త చట్టం చేసింది. ఆ చట్టంలోని నిబంధనలను రాష్ట్రంలో అమలు చేయకపో వడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన రమన్‌జీత్‌సింగ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు విని పిస్తూ సవరించిన చట్ట నిబంధనల ప్రకా రం ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారికి కఠిన శిక్షలను సిఫారసు చేసిందని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్స్ జారీ, రవాణా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని కేంద్రం నిర్ణ యించిందని వివరించారు.  ఈ నిబంధనల అమలు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభు త్వాల విచక్షణకే వదిలివేసిందని తెలిపా రు. సవరించిన నిబంధనల ప్రకారం జరిమానాలు, కేసుల నమోదు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.