calender_icon.png 26 December, 2024 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టేజీ మీదికి నువ్వెట్ల ఎక్కుతవ్?

18-09-2024 04:15:15 AM

  1. జనగామ డీసీసీ అధ్యక్షుడిని కిందికి దింపిన కార్యకర్తలు 
  2. ప్రజాపాలన దినోత్సవంలో కొమ్మూరికి చేదు అనుభవం

జనగామ, సెప్టెంబర్ 17(విజయక్రాంతి): ప్రభుత్వ కార్యక్రమం సాక్షిగా జనగామ డీసీ సీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిపై సొం త పార్టీ కార్యకర్తల్లో ఉన్న వ్యతిరేకత బయటపడింది. కొన్ని రోజులుగా ఆయన నాయక త్వంపై తిరుగుబాటు చేస్తున్న కొందరు నా యకులు ప్రజాపాలన దినోత్సవంలో పరు వు తీసినంత పనిచేశారు. సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని మంగళవారం జనగామ కలెక్టరేట్‌లో ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై విప్ ఐలయ్యతో పాటు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అడిషనల్ కలెక్టర్లు పింకేశ్‌కుమార్, రోహిత్‌సింగ్, డీసీపీ రాజమహేంద్రనాయక్ కూర్చున్నారు. వీరితో పాటు డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కూడా కూర్చోవడంతో సొంత పార్టీ కార్యకర్తలే అసహనం వ్యక్తం చేశారు. ఏ హోదాలో అతడిని వేదికపై కూర్చోబెట్టారని కలెక్టర్‌ను ప్రశ్నించారు.

కొమ్మూరి స్టేజీ దిగాల్సిందేనని గొడవ చేశారు. దీంతో కొమ్మూరి వర్గానికి, వ్యతిరేక వర్గానికి మధ్య కాసేపు గొడవ జరిగింది. ప్రతాప్‌రెడ్డి స్టేజీ దిగి కింద ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చున్నారు. ఈ పరిణామాలను గమనించిన బీర్ల ఐలయ్య తన ప్రసంగం పూర్తయ్యాక.. కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసికట్టుగా ఉండాలని, నాయకుడు అనేవాడు అందరినీ కలుపుకొని పోవాలని పరోక్షంగా కొమ్మూరికి సూచించి వెళ్లిపోయారు.