జన్వాడ ఫామ్ హౌస్ కేసులో విజయ్ మద్దూరిని విచారించిన పోలీసులు
చేవెళ్ల (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడ ఫాం హౌస్ లో జరిగిన పార్టీ వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలను మోకిలా పోలీసులతో పాటు చేవెళ్ల ఎక్సైజ్ పోలీసులు ఇప్పటికే విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ2గా ఉన్న రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరిని బుధవారం మోకిలా పోలీసులు విచారించారు. న్యాయవాదితో కలిసి విచారణకు హాజరైన ఆయనను డ్రగ్స్ ఎవరిచ్చారు..? ఎప్పటి నుంచి అలవాటు ఉంది.. ? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు..? డ్రగ్స్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నాయా..? అని ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది.