calender_icon.png 23 February, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుచి ఎలా తెలుస్తుంది?

16-02-2025 12:00:00 AM

చాక్లెట్, బిస్కెట్, ఐస్ క్రీమ్, పిజ్జా.. టేస్టీగా ఉందని లాగేస్తాం. టేస్ట్ తెలియాలంటే దానిని నాలుక మీద పెట్టాలి. నాలుక మీద పెడితే టేస్ట్ తెలుస్తుంది. నాలుక మీదున్న టేస్ట్ బడ్స్ వల్ల రుచి తెలుస్తుందని మనకు తెలుసు. అయితే ఇది కొంత వరుకు కరెక్ట్. టేస్టు తెలిపేవి రుచి మొగ్గలే (టేస్ట్ బడ్స్) అయినప్పటికీ నిజానికి మనకు పూర్తి టేస్ట్ తెలిసేది లాలాజలం వల్లనే.

ఎందుకంటే మనం తిన్న పదార్థం లాలాజలంలో కరిగిన తర్వాతే నాలుకపై ఉండే రుచిమొగ్గలు (టేస్ట్ బడ్స్) వాటిని గ్రహించగలుగుతాయి. అందుకే నమలడం మొదలుపెట్టిన కొద్ది సేపటి తర్వాత రుచి ఇంకా స్పష్టంగా తెలుస్తుంటుంది. అన్నట్టు మన నోట్లో ప్రతి రోజూలీటర్ నుంచి 1.6 లీటర్ల వరకు లాలాజలం స్రవిస్తూ ఉంటుంది.

లాలాజలం నుంచే జీర్ణప్రక్రియ మొదలవుతుంది. ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియను వేగవంతం చేసేందుకు లాలాజలం ఎక్కువగా ఊరుతుంది. ఒక వేళ సరిగ్గా అరగక పోతే కడుపులో ఇబ్బందిగా ఉంటే లాలాజలం మరింత ఊరి పొట్టలో ఉన్న అరగని దానిని వాంతి ద్వారా బయటకు వచ్చేలా చేస్తుంది. అందుకే వాంతికి ముందు నోటిలో ఉమ్ము పెరుగుతుంది.