పురుష టైలర్లు, బార్బర్లు ఆ పనులు చేయొద్దు యూపీ మహిళా కమిషన్
లక్నో, నవంబర్ 8: బ్యాడ్ టచ్ నుంచి మహిళలను రక్షించేందుకు యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు చేసింది. మహిళల దుస్తుల కొలతలను పురుష దర్జీలు తీసు కోవద్దని, అమ్మాయిల జుట్టును కత్తిరించే పనులు కూడా వారు చేయొద్దని ప్రతిపాదించింది. ఈ మేరకు మహిళా కమిషన్ సభ్యు రాలు హిమానీ అగర్వాల్ వెల్లడించారు. ఈ వృత్తుల్లో ఉన్న పురుషులు అమ్మాయిలను అసభ్యంగా తాకి, వేధించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం తాము ప్రతిపాదనలు మాత్రమే చేశామని, త్వరలోనే ప్రభుత్వానికి పంపనున్నట్లు పేర్కొన్నారు.
కమిషన్ ప్రతిపాదనలు..
అమ్మాయిల దుస్తుల కొలతలను మహిళలు మాత్రమే తీసుకోవాలి. ఈ ప్రాం తాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలి.
సెలూన్‌లలో మహిళా కస్టమర్లకు అమ్మాయిలే సేవలందించాలి.
జిమ్, యోగా సెంటర్లలో మహిళా ట్రైనర్లే ఉండాలి.
స్కూల్ బస్సుల్లో తప్పనిసరిగా మహిళా ఆయా లేదా లేడీ టీచర్ ఉండాలి. డ్రామా ఆర్ట్ సెంటర్లలోనూ మహిళా డ్యాన్స్ టీచర్లను ఏర్పాటు చేయాలి.
మహిళలకు సంబంధిత వస్తువులను విక్రయించే దుకాణాల్లో తప్పనిసరిగా మహిళా సిబ్బందే ఉండాలి.
కోచింగ్ సెంటర్లలో సీసీటీవీలు ఏర్పాటు చేయాలి.