calender_icon.png 26 November, 2024 | 10:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవితకు బెయిల్ వస్తుందని వారికి ఎలా తెలుసు?

28-08-2024 12:00:00 AM

మూడు రోజుల ముందే బీఆర్‌ఎస్ నేతల హడావుడి 

కవితకు ఐదు నెలల్లోనే రావడమేంటి? 

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 

హైదరాబాద్, ఆగస్టు 27 (విజ యక్రాంతి): ఎమ్మె ల్సీ కవితకు బెయి ల్ వస్తుందని మూడు రోజుల ముం దే బీఆర్‌ఎస్ నేతకు ఎలా తెలుసని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. మూడురోజుల ముందే హడావుడి చేయడం, ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లడంలో అంతర్యమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడి యాతో మాట్లాడుతూ.. బెయిల్‌పై జడ్జిలు తీర్పు ఇవ్వకముందే కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌తో పాటు బీఆర్ ఎస్ నేతలకు ఎలా తెలుస్తుందన్నారు.

లిక్కర్ కేసులో సిసోడియాకు బెయిల్ రావడానికి 17 నెలలు పడితే.. అదే కేసులో  కవితకు 5 నెలల్లోనే బెయిల్  ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కవిత కు బెయిల్‌తో బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనమవుతుంద ప్రచారానికి బలం చేకూరిందన్నారు. ఇదే మోదీకి కేసీఆ ర్ గిఫ్ట్ ఇవ్వనున్నారా అని అనుమా నం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను దెబ్బ తీయాలని బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్ర చేస్తున్నాయని  ఆరోపించారు. బీజేపీ కి తెలంగాణలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, అందుకే బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి వెళ్లడానికి లిక్కర్ కేసు ప్రధాన భాగమైందన్నారు. కవిత బెయిల్ కోసం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ డమ్మీ పాత్ర పోషించిందని ఆరోపించారు.