30-01-2025 12:00:00 AM
కడ్తాల్ మండలం బాలాజీ నగర్ తండాలో బదిలీపై వెళ్లిన ఉపాద్యాయుడు సర్కారు బడిలో చదువు చెప్పేవారు లేక అయోమయంలో చిన్నారులు
కడ్తాల్, జనవరి 29 ( విజయ క్రాంతి ) : ప్రభుత్వ పాఠశాలలో పర్యవేక్షణ కరువైంది. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దుతామంటూ... సందర్భం వచ్చినప్పుడల్లా నేతలు, అధికారులు ఊకదంపుడు ప్రసంగాలకే పరిమితం అవుతున్నారు.... ఆచరణలో మాత్రం... వాటికి దూరంగా ఉండడం విడ్డూరం.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం బాలాజీ నగర్ తండా గ్రామ పంచాయితీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో పనిచేసిన ఉపాద్యాయుడు ఇటీవల బదిలీపై వెళ్ళి రోజులు గడుస్తున్న... కానీ ఆ పాఠశాలకు మరో ఉపాధ్యాయుడిని నియమించలేదు. దీంతో పాఠశాలలో నిత్యం విద్యార్థులు వచ్చి వెళుతున్నారు. స్కూల్ లో చిన్నారులకు చదువులు చెప్పే టీచర్ లేక పోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
గిరిజన ప్రజలు తమ బిడ్డల్ని ప్రైవేట్ పాఠశాలలో చదివిపించే స్థోమత లేక సర్కారు పాఠశాలలో చేర్పిస్తే ఉన్న ఒక ఉపాధ్యాయుడు.... బదిలీ కావడం వారి లో ఆందోళన గురి చేస్తుంది. టీచర్ లేకపోడం తో తమ పిల్లల చదువులు ఎ లా సాగుతాయి అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం వెంటనే బాలాజీ నగర్ తండాకు ఉపాధ్యాయున్ని నియమిం చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతు న్నారు.
ఈ విషయంపై మండల విద్యాధికారి సత్యనారాయణను వివరణ కోరగా ఉపాధ్యాయుడి బదిలీపై వెళ్లిన విషయం వాస్తవమే. రెండు రోజుల్లో బాలాజీ నగర్ తండాకు పోస్టును జిల్లా విద్యాశాఖ నియమిస్తుంది. విద్యార్థుల చదువులకు ఇబ్బందులు లేకుండా నేటి నుంచి సిఆర్పీ ని నియమిస్తామని ఎంఈఓ వివరించారు.