calender_icon.png 15 January, 2025 | 7:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువులో తుమ్మ.. ఎండెనెట్లమ్మా?

13-09-2024 11:58:34 PM

సూర్యాపేట సెప్టెంబర్ 13: సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం ఉండ్రుగొండ సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎర్రచెరువులోని వందలాది నల్ల తుమ్మ చెట్లు బాగా పెరిగి పచ్చధ నం ఆవరించడంతో జాతీయ రహదారిపై వె ళ్లేవారికి ఆహ్లాదాన్ని కలిగించేది. అయితే ఆ ఆనందం ఎంతో కాలం మిగలలేదు. ఉన్నట్టుండి చెట్లన్ని పూర్తిగా ఎండిపోయి ప్రస్తు తం వాడిన మోడులే కనిపిస్తున్నాయి. చెరు వు నిండా నీరున్నా చెట్లెందుకు ఎండిపోతున్నాయంటూ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ నే ఈ దృశ్యాన్ని వాహనదారులు తమ మొ బైల్‌ఫోన్‌లలో బంధించుకుంటున్నారు. వేర్ల ద్వారా శ్వాసక్రియను జరుపుకోలేక నల్లతుమ్మలు ఎండిపోయాయని నిపుణులు చెబుతున్నారు.