calender_icon.png 5 February, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల సంఖ్య ఎలా తగ్గింది?

05-02-2025 01:30:39 AM

ఎమ్మెల్యే పాయల్ శంకర్

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాం తి): పదేళ్లలో ఓసీలు పెరిగి, బీసీలు ఎలా తగ్గారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమవి కనుమరుగవుతున్న జాతులా? అని నిలదీశారు. 2014లో బీఆర్‌ఎస్ చేసిన సర్వేలో 51శాతం ఉన్న బీసీలు.. ఇప్పుడు 46శాతానికి ఎలా తగ్గారో ప్రభుత్వ సమాధానం చెప్పాలన్నా రు.

ఎన్నికల సమయంలోనే రాజకీయ పార్టీలకు బీసీలు గుర్తొస్తారని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తూతూమంత్రంగా సర్వే చేసి చేతులు దులుపుకుందని అభిప్రాయపడ్డారు. హిందూ బీసీ, ముస్లిం బీసీ అంటూ సర్వేలో పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

హిందూ బీసీ, ముస్లిం బీసీ అంటూ కొత్త పదాలను తీసుకొచ్చి రిజర్వేషన్ల అంశంపై కోర్టుల్లో కేసులు వేసేలా చేయడం ద్వారా ప్రక్రియను ప్రభుత్వం జాప్యం చేయాలని చూస్తుందని ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలు ఓడిపోయే సీట్లను బీసీలకు కట్టబెడుతున్నాయని విమర్శించారు. కుల వృత్తులను నమ్ముకోవడం వల్లే బీసీలు ఇంకా ఎదగలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.