30-03-2025 12:00:00 AM
తెలంగాణలో ముఖ్యమంత్రి, ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జట్టు కట్టి ముగ్గు రు పాత్రికేయులను కారాగారానికి పంపిం ది. కోర్టు దిక్కు లేకపోతే, ఏ దిక్కూ ఉండ దు. హైదరాబాద్ న్యాయస్థానం బెయిల్ ఇచ్చిన తర్వాత వారు విడుదలయ్యారు. మనకు ఏ విద్యా వద్దు, విమర్శ వద్దు. కవిత్వం వద్దు. వ్యంగ్యం వద్దు. మనకు కావలసింది భజన. సన్మానాలు. ఎందు కూ పనికి రాని శాలువలు. వేల రూపాయల పూలహారాలు. జైలుకు కారణం వా రు తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించారట. ముఖ్యమంత్రికి నచ్చలేదు. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నచ్చదు. కోపం వచ్చింది కూడా. వారిని జైలకు పంపారు. పోలీసు లు ఫోన్లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. వారి తిట్టు తీవ్రంగా ఘాటుగా న సాళానికి తగిలినట్టుంది. ఒక్క సంఘటన కాని బోలెడు కేసులు.
ముంబయిలో ఉపముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారనే కారణంగా కమెడియన్ కునాల్ కామ్రాపై అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కామ్రా తన స్టాండ్- అప్ కామెడీ ప్రదర్శనలో షిండేపై వ్యంగ్యంగా ‘దేశద్రోహి’ అని వ్యాఖ్యానించారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని ప్ర భుత్వ మద్దతుదారులు ఆరోపించారు. మ రింత ముందుకు వెళ్లి మహారాష్ట్ర శాసనమండలిలో ఇటీవల (27 మార్చి 2025 న) కామ్రాపై ప్రివిలేజ్ నోటీసు జారీ చేయించారు. అంటే, అన్ని రకాల శిక్షలు వేయడానికి సిద్ధమా? మనకు వ్యంగ్యం అవసరం లేదు. నవ్వు వద్దు. విమర్శ అక్కరలేదు.
ఇక, గుజరాత్ కథ చూడండి. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హిపై 10 ఫిబ్రవరి (2025)న ఒక ఎడిటెడ్ వీడియోను షేర్ చేశారనే ఆరోపణలతో ఎఫ్‌ఐఆర్ నమోదైంది (ఇప్పుడు తెలుగు పదం ఇంగ్లీషు పదం అని తేడా లేదు. వీడియో, షేర్ అం టూ జనానికి తెలుసు). పోలీసులకు మద్దతుగా గుజరాత్ హైకోర్టు కూడా ఈ కవి త్వాన్ని లేదా పరువు దీసేదిగా లేదా అపకీర్తికరమైందిగా ప్రకటించింది. మన అదృ ష్టం వల్ల సుప్రీంకోర్టు మాత్రం హైకోర్టు తీర్పును తిరస్కరించింది.
ఒక కవితాన్ని మనం భరించలేం. దాని కో వివాదం. అప్పుడు దావాలు, వాదా లు. దానికి మళ్లీ కోర్టులు, లాయర్లు, భ యానకమైన ఖర్చులు, ప్రత్యేక విమానా లు, విలాసవంతమైన హోటళ్లు వాడుకుంటారు. ఎంత ఖర్చయినా సరే. ప్రభుత్వం వైపు కూడా ఇదే కథ. కోట్లు కోట్లు ప్రభు త్వ డబ్బులు ఖర్చవుతుంటాయి.
ఈ కవిత్వం ఏ మతానికి వ్యతిరేకంగా లేదు. దీని వ్యతిరేకులు హింసకు దిగినా, ‘మేము హింసకు దిగమని’ సూచిస్తారు. ఏ సమాజానికి, ఏ మతానికి, ఏ రకం సముదాయాన్ని టార్గెట్ చేసి ఈ కవిత రా సారని అనుకోవడం ఎందుకు? ఈ వివాదాస్పద వీడియో 46 సెకన్ల నిడివి ఉంది. ఇందులో, ప్రతాప్‌గర్హిపై పుష్ప వృష్టి జరుగుతున్న సమయంలో ఒక పాట నేపథ్యం లో వినిపించింది. పోలీసులు మాత్రం దీ నిని ‘విచ్చలవిడిగా రెచ్చగొట్టే విధంగా ఉం ది, దేశ ఐక్యతకు భంగం కలిగించేలా ఉం ది’ అని అభిప్రాయపడ్డారు. దీనికి వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ ఎంపీ కోర్టులో పోరా డాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే అధికార పార్టీ వారైతే ఫరవాలేదు.
ఇది వాదన. వివాదం. కనుక చివరకు ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఘనత వహించిన న్యాయ రక్షకులైన న్యా యస్థానం వారు ఏమంటున్నారంటే, వ్యక్తిగతంగా లేదా ఒక వర్గానికి బృందానికి, జట్టువారికి తమ అభిప్రాయాలను వ్యక్తపరచే స్వేచ్ఛ ఆరోగ్యకరమైన నాగరిక సమా జానికి అనివార్యం. భావ వ్యక్తీకరణ లేకుం డా మన సంస్కృతి అభివృద్ధి చెందలేదు.
ప్రజాభిప్రాయ స్వేచ్ఛ ఉండాల్సిందే
న్యాయమూర్తి ఓకా తన తీర్పులో స్ప ష్టం చేశారు: “పోలీసు వ్యవస్థ, ప్రభు త్వం వారి అధికారం మీద అసురక్షితంగా ఉం డి, విమర్శను హానికరంగా భావిస్తూ వ్యక్తిగత స్వేచ్ఛను అణిచివేయడం తగ దు”. ప్ర భుత్వం ‘సడక్ ఛాప్’ (రోడ్డుపై లభించే చీ ప్ కవిత్వం) అంటూ ఈ కవిత్వా న్ని వ్యతిరేకించింది. సుప్రీంకోర్టు మాత్రం అభిప్రా య స్వేచ్ఛకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
75 ఏళ్ల ప్రజాస్వామ్యంలో కేవలం ఒక కవితా వచనం లేదా వ్యంగ్యంగా చెప్పిన కామెడీ సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొడుతోందని అనుకోవడం సరికాదు. అట్లా అనుకోవడం సమాజాన్ని మూగబోయే లా చేస్తుంది, అభివృద్ధికి ఆటంకంగా మా రుతుంది. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛా భావ న అత్యంత ప్రాధాన్యమైంది. కవి, రచయి త, కళాకారుడు లేదా నాటక రచయిత ఎవరైనా తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పే హక్కు కలిగి ఉండాలి. కేవలం మెజారిటీకి నచ్చనందుకు ఎవరినీ నిశ్శబ్దంగా చేసి వేయలేరు.
ఒక సమాజం కేవలం మెజారిటీ అభిప్రాయాన్ని మాత్రమే అనుసరించి, ఇతర భావ జాలాలను అణచివేస్తే, అది ప్రజాస్వామ్యం కాదు. చివరాఖరికి ఇట్లా అను కుందాం. స్వేచ్ఛాయుత భావవ్యక్తీకరణను అణచి వేయడం ప్రజాస్వామ్యానికి ము ప్పు. భావ వ్యక్తీకరణ హక్కు మన సంస్కృతిలో నిక్షిప్తమై ఉంది. కవిత్వం, నాటకం, స్టాండ్-అప్ కామెడీ, వ్యంగ్యం వీటిని అణిచివేయాలనే ప్రభుత్వ యత్నాలు సదా చారం కాదు. ఇప్పటికైనా అలాంటి వారి లో మార్పు వస్తుందంటారా?
ప్రొఫెసర్, మహీంద్రా విశ్వవిద్యాలయం, హైదరాబాద్
డా. మాడభూషి శ్రీధర్