05-03-2025 01:07:02 AM
హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): ప్రభుత్వానిదంటున్న 25 ఎకరాల భూమిలో కేవలం 200 చదరపు గజాల ప్లాట్‌కు కలెక్టర్ ఎలా నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేస్తారని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. చట్టంలోని ఏ నిబంధన కింద కలెక్టర్ ఎన్వోసీ జారీ చేశారో తెలిపాలని ఆదేశించింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండ లం రాయదుర్గ్ నౌకల్సా గ్రామ ప్రశాంతిహిల్స్‌లోని సర్వే నంబర్ 66/2లోని 200 చదర పు గజాల ప్లాట్‌కు 2023 సెప్టెంబర్ 9న నాటి కలెక్టర్ ఎన్వోసీ జారీ చేయడాన్ని సవా ల్ చేస్తూ ఆళ్లగడ్డ చెన్నమ్మ అనే మహిళ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌పై మంగళ వారం న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. ‘ప్రశాంతిహి ల్స్ పరిధిలోని 25 ఎకరాల్లోని 200 చదరపు గజాల భూమి విషయంలో కో సొసైటీతో వివాదం నడుస్తున్నది. ప్లాట్‌పై మాజీ ప్రభుత్వ ఉద్యోగి కామిరెడ్డి మృత్యుంజయరెడ్డికి ప్రభుత్వం నుంచి ఎన్వోసీ జారీ అయింది’ అని కోర్టుకు తెలిపారు. దీంతో ప్రభుత్వ న్యాయవాది కౌంటర్ దాఖలుకు గడువు కోరారు.
దీంతో న్యాయమూర్తి విచారణను ఈనెల 10వ తేదీకి వాయిదా వేశారు. అలాగే ఎన్వోసీ జారీ చేసిన తీరుపై కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఏ నిబంధన కింద కలెక్టర్ ఎన్వోసీ జారీ చేశారో వివరణ ఇవ్వాలన్నారు.
కౌంటర్ దాఖలు చేయని పక్షంలో సీబీఐ, ఈడీలకు విచారణను అప్పగించాల్సి ఉం టుందని హెచ్చరించారు. అలాగే పిటిషన్‌ను పిటిషనర్ ఉపసంహరించుకోవాలనుకున్నా, అందుకు అనుమతి ఇవ్వొద్దని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు.