calender_icon.png 13 March, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దక్షణాది హీరోల చిత్రాలకు వందల కోట్లు ఎలా?

12-03-2025 12:00:00 AM

ఒకప్పుడు బాలీవుడ్‌తో దక్షిణాది ఏమాత్రం సరితూగదనే అభిప్రాయం ఉండేది. ద క్షిణాది నటీనటులను చిన్నచూపు చూసిన దాఖలాలు ఉ న్నాయి. కానీ ఇప్పుడు బాలీవుడ్‌ని సైతం దక్షిణాది సినిమాలు దున్నేస్తున్నాయి. ఎందుకోగానీ బాలీవుడ్‌లో ఒకట్రెండు సినిమాలు మినహా పేలడమే లే దు. తాజాగా జరిగిన ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇదే విషయాన్ని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్‌తో సీనియర్ రచయిత జావేద్ అక్తర్ ముచ్చటించారు.

ఏటా ఎన్నో సరికొత్త చిత్రాలు బాలీవుడ్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా గతంతో పోలిస్తే ఇప్పుడు వాటికి ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ అవడం లేదు. ముక్కూ, మొ హం తెలియని దక్షిణాది హీరోల సినిమాలు ఇక్కడి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. దీనిపై ఆమిర్ అభిప్రాయాన్ని జావేద్ కోరారు. “ఒకప్పటితో పోలిస్తే హిందీ చిత్రాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవడం లేదు. దక్షిణాది చిత్రాలు మాత్రం డబ్ అయి అలరిస్తూ బాలీవుడ్‌లో దాదాపు రూ. 700 కోట్ల వసూళ్లను రాబడుతున్నాయి.

అసలేం జరుగుతోంది?” అని జావెద్ అక్తర్ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఆమిర్.. “దక్షిణాది, ఉత్తరాది చిత్రాలనేది సమస్యే కాదు. మనం ఆర్థిక శాస్త్రంలో అనుసరిస్తున్న డిమాండ్ అండ్ సప్లు సూత్రం సినిమాలకూ వర్తిస్తుంది. సినిమాను చూడమని ప్రేక్షకులను అర్థిస్తాం.

స్పందన సరిగా లేకుంటే రెండు నెలల లోపలే ఓటీటీ ద్వారా వారి ఇంటి తీసుకెళ్లి ఇస్తాం. కాబట్టి ఒకే ప్రాడక్ట్‌ను రెండు సార్లు ఎలా విక్రయించాలో మనకు తెలియదు. అవకాశం లేనప్పుడు థియేటర్‌కు వెళ్లి చూసేవారు. ఇప్పుడు నచ్చితేనే వెళ్లి చూస్తున్నారు. మన సొంత బిజినెస్ మోడల్‌తో మన సినిమాను మనమే చంపుకుంటున్నాం. దర్శకులు, కథ కథనాలపై ఫోకస్ పెట్టాలి” అని పేర్కొన్నారు.