calender_icon.png 22 January, 2025 | 11:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంట్లో ఎట్లుండుడు?

22-01-2025 02:00:45 AM

  1. * ఇండ్ల ముందుంతా మురుగు నీరే
  2. * ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునేవారేరి
  3. * దుర్వాసన, దోమలతో సహవాసం
  4. * అవస్థలు పడుతున్న బుడగ జంగం కాలనీ
  5. * సమస్యను కలెక్టర్ పరిష్కరించాలంటున్న కాలనీవాసులు

కోనరావుపేట, జనవరి21: నిత్యం దుర్వాసన, దోమలతో సహవాసం చేసుకుంటూ మురుగు నీటి మధ్య నివాసం ఉంటున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఎండ కాలం, వానకాలం, శీతా కాలమేదైనా మురుగు నీటితో ఇబ్బందులు పడాల్సిందే.

ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండందనే ప్రచారాలు చేసే అధికారులు అన్ని కాలాల్లో రోడ్డంతా మురుగు నీరున్నా చర్యలు తీసుకోకపోవడంపై పలు అనమానాలు కల్గిస్తు న్నారు.

రోగాల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న తమ గోడు వినేవారే లేరని కాలనీవాసులు వాపోతున్నారు. జన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలోని బుడగ జంగ కాలనీ వాసులు మురుగు నీటి మధ్య జీవనం సాగే పరిస్థితి నెలకొంది.

ఆ కాలనీ వాసులకు రోజువారి మురుగు నీరు రోడ్డు మీదకు రావడంతో పాటు చుట్టూ పక్కల ఉన్న పొలంల నుంచి ఎక్కువైనా నీరు,వాటర్ ట్యాంక్ నుంచి వచ్చే నీరంతా రోడ్డు పైకి వస్తుంది. నిరంతరం రోడ్డు పైనా నీరు నిల్వ ఉండడంతో ఈగలకు, దోమలకు నిలయంగా మారాయి. ఇండ్లముందు నీరు నిల్వ ఉండడంతో చిన్నపిల్లలకు, వృద్ధులు రోగాల బారిన పడుతున్నారు.

చుట్టాలు వస్తే ఒక్క రోజు కూడా ఉండడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటిపన్ను, నలా బిల్లు, కరెంటు బిల్లులు ఊరి వాళ్లకంటే ముందే చెల్లిస్తున్నప్పటికి, స్థానిక పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు చెప్పిన మా గోడు విన్నపాపన పోలేదు.

మురుగు నీరు ఎక్కువైతే తామే పారతో నీటిని మళ్లిస్తున్నామని, ఈ రోడ్డు వెంట నిత్యం పదుల సంఖ్యలో వ్యవసాయ క్షేత్రాలకు రైతులు మురుగు నీటి మధ్యలోంచి ఇబ్బందులు పడుతూ వెళ్లుతుంటారు.

సాయంత్రం అయితే చాలు ఇంటి ముందు ఉన్న మురుగు నీటితో దుర్వాసన రావడంతో పాటుదోమలు కాళ్లకు, చేతులకు కాటేస్తున్నాయి. వాటి బాధకు ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్లు వేసుకోని ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటికైనా తమ బాధల నుంచి కాపాడేలా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పందించి, చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.

’పిల్లలకు అరిగోస అయితుంది

మొన్న మనువడికి జ్వరం వస్తే ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకపోతే రూ.30 వేల వరకు ఖర్చు అయింది. రోజు దోమలే ఇంటి చుట్టూ ఉండడం, బయటకు వస్తే చాలు కుట్టుడే మురుగు నీటి వాసన భరించలేం. ఎన్నిసార్లు కార్యదర్శి సారుకు చెప్పిన పట్టించుకుంట లేరు.

అందరికంటే ముందే ఇంటి పన్ను, నలా బిల్లు, కరెంట్ బిల్లులు కడుతున్నం. మా భాద కలెక్టర్ సారు వింటేనే బతేకతట్టు ఉన్నాం. చిన్నపిల్లలకైతే అరిగోస అవుతుంది.

 - కంటే లక్ష్మి, కాలనీవాసులు

చచ్చి బతుకుతున్నం

దోమలు, వాసనతో రోజు చచ్చి బతుకుతున్నం. ఏకాలమైనా సరే ఇండ్ల ముందు మురుగు నీళ్లు ఉంటున్నయి. నీళ్లు ఎక్కువైతే ఇండ్ల ముందు బండ్లు పోతుంటే చిన్న పిల్లలకు గాయాలు అవుతున్నయి. ఎన్నిసార్లు కార్యదర్శి సారుకు చెప్పిన మా వింట వింటలేడు.

ఊరికి దూరంగా ఉండడంతోనే తమ బతుకులను ఎవ్వరూ పట్టించుకుంటలేరు. ఎన్నికలు వచ్చినప్పుడే వచ్చి, అన్ని చేస్తామంటారు. రోజు ఇబ్బందులు పడుతున్న పట్టించుకుంటలేరు. కలెక్టర్ సారు మా గోడు విని న్యాయం చేయాలి.                                కంటే లింగయ్య కాలనీ వాసులు