calender_icon.png 27 October, 2024 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల చదువులు సాగేదెలా?

27-10-2024 12:27:25 AM

  1. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి
  2. సెక్రటేరియట్ ముట్టడికి ఏఐఎస్‌ఎఫ్ యత్నం.. నాయకుల అరెస్ట్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26(విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ విడుదల చేయకపోతే విద్యార్థులు చదువులు కొనసాగించేది ఎలా అని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్‌ఏ స్టాలిన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫీజు బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్‌తో శనివారం ఏఐఎస్‌ఎఫ్ నాయకులు సెక్రటేరియట్ ముట్టడికి యత్నిం చారు.

జీహెచ్‌ఎంసీ కార్యాలయం నుంచి సచివాలయం వైపునకు ర్యాలీగా బయలుదేరిన ఏఐఎస్‌ఎఫ్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాటాడుతూ.. ప్రభుత్వాలు మారినా విద్యార్థుల తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో ఇంటర్, డిగ్రీ, ఉన్నత విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని అన్నారు.ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్, నాయకులు రామకృష్ణ, బానోత్ రఘురాం, క్రాంతి, రహమాన్, వెంకటేష్‌పాల్గొన్నారు.