రోహిత్, కోహ్లీ ఆటతీరుపై విమర్శలు
- వరుసగా విఫలమవుతున్న స్టార్ ఆటగాళ్లు
- రిటైర్మెంట్ యోచన చేయాలని మాజీల సూచన
విజయక్రాంతి ఖేల్ విభాగం: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. పుష్కర కాలంగా టీమిండియాకు మూల స్తంభాలుగా ఉన్నారు. ఈ ఇద్దరు లేకుండా జట్టును ఊహించుకోవడం కష్టం. ఎవరికి సాధ్యం కాని ఘనతలు సాధించిన వీరు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఫామ్‌ను కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న ఈ ఇద్దరు పరుగులు సాధించేందుకు తంటాలు పడుతు న్నారు.
సీనియర్లుగా జట్టును ముందుండి నడిపించాల్సిన ఆటగాళ్లే వరుసగా విఫలమవుతుండడం.. చేసిన తప్పులే మళ్లీ చేస్తుం డడంతో జట్టుకు నష్టం జరుగుతోంది. భార త కెప్టెన్ రోహిత్ శర్మ ఆటతీరు నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గావస్కర్ సిరీస్ అందుకు ఉదాహరణ.
ఈ సిరీస్‌లో మూడు టెస్టులు కలిపి ఐదు ఇన్నింగ్స్‌ల్లో 31 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ 2024-25 సీజన్‌లో 15 ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 10.92 సగటుతో పరుగులు సాధించడం గమనార్హం. ఒకప్పుడు విధ్వంసానికి పెట్టింది పేరైన రోహిత్ బ్యాట్ ఇప్పుడు మూగబోతోంది.
సీనియర్‌గా బాధ్యతగా ఆడాల్సిన తరుణం నుంచి నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. రోహిత్ ఆటతీరు చూస్తుంటే అసలు క్రీజులో నిలబడేందుకు కూడా ఇష్టం చూపడం లేదని తెలుస్తోంది. గత 15 ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేయడం అతని బ్యాటింగ్ బలహీనతను చూపిస్తోంది.
ఆ బలహీనతే శాపంగా..
ఇక కోహ్లీ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. అడపాదడపా మె రుస్తున్నప్పటికీ పూర్తి బాధ్యతతో ఆడి చాలా కాలమైంది. ఆసీస్‌తో జరుగుతు న్న సిరీస్‌లో తొలి టెస్టులో సెంచరీ చేసి న కోహ్లీ తర్వాత వరుసగా విఫలమయ్యాడు. కెరీర్ ఆరంభం నుంచి ఆఫ్‌సై డ్ ఆవల పడే బంతులు ఆడ డం కోహ్లీకి బలహీనతగా ఉంది.
కెరీర్ పీక్ స్టేజీలోనూ ఈ బలహీనతను మరవలేకపో యాడు. అయితే 2018 ఇంగ్లండ్ పర్యటనలో మాత్రం కోహ్లీ ఒక్కసారి ఆఫ్‌స్టం ప్ బలహీనతతో ఔట్ కాకపోవడంతో దానిని అధిగమించాడనుకున్నాం. కానీ కొన్నాళ్లుగా మళ్లీ అదే తీరహాలో ఔటవుతున్నాడు. ప్రస్తుత ఆసీస్‌తో టెస్టు సిరీ స్‌లో ఏడుసార్లు దాదాపు ఆఫ్‌స్టంప్ బ లహీనతను బయటపెడుతూ వికెట్ పా రేసుకున్నాడు.
కెరీర్ చరమాంకంలో ఉ న్న రోహిత్, కోహ్లీ చివరి దశలో సవాళ్లను అధిగమించి మంచి ఇన్నింగ్స్‌లు ఆ డాల్సిన అవసరముంది. కోచ్‌ల సా యంతో క్లిష్ట పరిస్థితులను దాటడం లేదంటే యువ ఆటగాళ్లకు దారి ఇవ్వడమే మేలు. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌ను భారత్ అందుకోవడం లో కీలకపాత్ర పోషించిన ఈ ఇద్దరూ టెస్టులకు వీడ్కోలు పలకడమే నయమని మాజీలు అభిప్రాయపడ్డారు.