calender_icon.png 12 January, 2025 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యాన్ని అందించే ఆసుపత్రిలో ఇలా ఉంటే ఎలా...

12-01-2025 04:27:30 PM

1,15 తేదీలలో ఆసుపత్రిలో పరిశుభ్రతకై ప్రత్యేక డ్రైవ్ పెట్టండి 

జిల్లా ప్రధాన జనరల్ హాస్పిటల్ లో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): జిల్లా ప్రధాన జనరల్ హాస్పిటల్ నందు పరిశుభ్రత సరిగా లేకుంటే ఎలా అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి(MLA Yennam Srinivas Reddy) అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రధాన జనరల్ హాస్పిటల్ నందు శ్రమదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆస్పత్రిలోని ఇరువైపులా ప్రత్యేకంగా పరిశీలించారు. డ్రైనేజీ వ్యవస్థను మూడ, మున్సిపాలిటీ నిధులను తీసుకువచ్చి బాగు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో కొంత వెనక సిద్ధ వహించిన సమస్య జటిలం అయ్యే అవకాశం ఉండేది కాదని, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే జనరల్ హాస్పిటల్ నందు సమస్యలు నెలకొన్నాయని పేర్కొన్నారు. మరో ఆరు నెలలకాల వ్యాధులు ఆసుపత్రిలోని అన్ని సమస్యలకు ముగింపు పలికేలా ప్రణాళికలు సిద్ధం చేసి వెంటనే పనులను ప్రారంభించాలని ఆదేశించారు. 

ప్రతి నెలలో 1,15 తేదీల్లో ప్రత్యేక డ్రైవ్..

ఆరోగ్యాన్ని అందించే ఆసుపత్రి పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉంటే ఎలా అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అధికారులను అడిగారు. కచ్చితంగా శానిటేషన్, డ్రైనేజ్, నిరుపయోగంగా ఉన్న పాత సామాగ్రిలను తొలగించడం వంటి కార్యక్రమాలు వెంటనే ప్రారంభించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఆసుపత్రిని మెరుగుపరిచి ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించే విధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పేద ప్రజలకు ఎందరికో ఉపయోగపడే ఈ ఆసుపత్రిని ఉన్నతంగా తీర్చిదిద్దుతమని స్పష్టం చేశారు. ఈ ఆసుపత్రి అభివృద్ధికి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని చెప్పారు. ప్రతి నెల 1,15 తేదీలలో ఆసుపత్రిలో క్లీన్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టి మున్సిపల్ చైర్మన్, ముడా చైర్మన్ లు పర్యవేక్షణ చేస్తారని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో విధుల పట్ల ఎవరు నిర్లక్ష్యం వహించినా సహించమని కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

నిరుపేదలు కాబట్టే ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య సదుపాయాల కోసం వస్తారని వారికి సవిధానంగా సమాధానం చెప్పు ఆరోగ్యాలను మెరుగుపరిచి పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ సింగ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, సిహెచ్ఓ రాము నాయక్, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేంధర్, నాయకులు రాములు యాదవ్, ఫయాస్, మోయిస్, లీడర్ రఘు, కౌన్సిలర్లు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.