calender_icon.png 30 October, 2024 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూపు-1 రిజర్వేషన్లు ఎలా?

30-08-2024 02:01:03 AM

సర్వీస్ కమిషన్, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): గ్రూప్-1 పోస్టుల భర్తీ వ్యవ హారంలో రిజర్వేషన్లను నిబంధనల ప్రకా రం అమలు చేయకపోవడంపై టీజీపీఎస్సీకి, ప్రభుత్వానికి గురువారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశి స్తూ విచారణను సెప్టెంబర్ 27వ తేదీకి వాయిదా వేసింది. గ్రూప్-1 పోస్టుల భర్తీ కి సంబంధించి జీవో 55కు సవరణ తీసుకొస్తూ జారీ చేసిన జీవో 29ని సవాలు చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన ఎం హనుమాన్ మరో ముగ్గురు హైకోర్టులో పిటి షన్ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్ కే శరత్ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు విని పిస్తూ గ్రూప్ మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని ఆరోపించారు. టీజీపీఎస్సీ 563 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిందని.. ఇందులో జనరల్ పోస్టులు 209, ఈడబ్ల్యూఎస్ 49, బీసీ (ఏ) 44, బీసీ (బీ) 37, బీసీ (సీ) 13, బీసీ (డీ) 22, బీసీ (ఈ) 16, ఎస్సీ 93, ఎస్టీ 52, క్రీడాకారులు 4, దివ్యాంగులు 24 పోస్టులున్నాయని వివరించారు. ప్రతి క్యాటగిరీలో 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడంలో టీజీపీఎస్సీ నిబంధనలు పాటించలేదని తెలిపారు. ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని వాదించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ జీవో 29ని రద్దు చేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రభుత్వానికి, పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు నోటీసులు జారీ చేశారు.