మంత్రి పొంగులేటి
ఖమ్మం, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): అర్హులైన ప్రతీ జర్నలిస్టుకు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇంటి స్థలం మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. కూసుమంచిలోని విజయరామ ఫంక్షన్ హాల్లో సోమ జరిగిన పాలేరు నియోజకవర్గ మీడియా మిత్రుల సమావేశంలో మంత్రి పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జర్నలిస్టుల ఇళ్ల సొసైటీ సమస్య సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, అయినప్పటికీ న్యా ఇబ్బందులు రాకుండా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చే ప్రక్రియ గురించి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అతి త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపిస్తామని తెలిపారు.
అదే విధంగా అక్రిడి హెల్త్ కార్డుల మంజూరులో జాప్యం, అమల్లో తలెత్తుతున్న లోపాలను సవరిస్తామని తెలిపారు. కూసుమంచి కేంద్రంలో మీడియాహౌజ్ లేదా ప్రెస్‌క్లబ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.