మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి
నల్లగొండ, డిసెంబర్ 30 (విజయక్రాంతి): అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలు కేటాయించేలా కృషి చేస్తానని మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. సోమవారం నల్లగొండ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.
ఇండ్ల స్థలాల కేటాయింపులో సుప్రీంకోర్టు తీర్పు అడ్డంకిగా మారిందని, ఈ అంశంపై ముఖ్యమంత్రితోపాటు అడ్వకేట్ జర్నల్‌తో చర్చించి ముందుకెళ్తామని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారుల సరసన జర్నలిస్టులను చేరుస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం సరికాదన్నారు.
దేశంలో జర్నలిస్టులకు ఒకే తరహా వేతనాలు ఉండవన్న అంశాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. అక్రిడిటేషన్ కార్డుల జారీపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి నిబంధనలు రూపొందించి కమిషనర్‌కు అందజే శామని వెల్లడించారు. ప్రభుత్వం ఆమోదిస్తే జనవరి నుంచి కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు.