calender_icon.png 25 November, 2024 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన జర్నలిస్టుందరికీ ఇండ్ల స్ధలాలు

24-11-2024 11:47:06 PM

మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం (విజయక్రాంతి): ఖమ్మంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన జర్నలిస్టులందరికీ  ఇళ్ల స్ధలాలు అందించాలనే సానుకూల దృక్పధంతోనే ప్రజాప్రభుత్వం ఉందని  రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారుఆదివారం ఖమ్మంలో స్ధానిక జర్నలిస్టుల యూనియన్ల నేతలతో కూడిన విలేకరుల బృందం మంత్రులను కలిసి,వినతిపత్రం అందజేసి, ఖమ్మం విలేకరులకు ఇండ్ల స్ధలాల సమస్య గురించి వివరించగా స్పందించి మంత్రులు మాట్లాడారు. ఖమ్మంలో వీలైనంత త్వరగా ఇండ్ల స్ధలాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అర్హులైన వారందరికీ ఇండ్ల స్ధలాలు దక్కేలా  మూడు యూనియన్లు సమిష్టిగా  కృషి చేయాలని మంత్రులు సూచించారుప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బందులున్నా  వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు.


విషయమై తుమ్మల జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి  జర్నలిస్టుల  ఇళ్ల స్ధలాల ప్రక్రియను వేగవంతం చేయాలని  ఆదేశించారు. సొసైటీకి కేటాయించాల్సిన భూమిని వీలైనంత తొందరగా ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారుమరోసారి యూనియన్ల నేతలతో భేటీ అవుతామని చెప్పారు. కార్యక్రమంలో టియుడబ్ల్యుజె (ఐజెయు) రాష్ట్ర కార్యదర్శి కె.రాంనారాయణ, జిల్లా శాఖ అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లుటిజెఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణటిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర నాయకులు  రాముతో పాటు  స్తంభాద్రి హౌజింగ్  సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు, కోశాధికారి యెన్నెబోయిన  సాంబశివరావుఉపాధ్యక్షులు మైసా పాపారావుపలువురు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.