calender_icon.png 27 October, 2024 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన జర్నలిస్ట్‌లందరికీ ఇళ్ల స్థలాలు

30-08-2024 01:19:37 AM

తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి

సూర్యాపేట, ఆగస్టు 29 : రాష్ట్ర వ్యాప్త ంగా అర్హులైన జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు, హెల్త్‌కార్డులు మంజూరీ ప్రక్రియను త్వరలో  సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించబోతున్నారని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో  గురువారం ఆయన మీ డియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం పదే ండ్ల కాలంలో జర్నలిస్టుల సమస్యలను  ఏ మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి, సమాచార, ప్రసారశాఖా మ ంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మూడు దపాలుగా చర్చలు జరిపి హైపర్ కమిటీని ఏర్పాటు చేశారని, జర్నలిస్ట్‌ల సమస్యల పరిష్కారానికి లైన్ క్లియర్ చేశారని స్ప ష్టంచేశారు. వచ్చే నెల మొదటి వారంలో జ ర్నలిస్ట్‌లకు ఇళ్ల స్థలాలు, హెల్త్‌కార్డులు, అక్రిడిటేషన్ కార్డుల మంజూరీ విషయంలో  సీ ఎం ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. అనంతరం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయ కులు శ్రీనివాస్‌రెడ్డిని సన్మానించారు. సమావేశంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు కే నాగేశ్వర్‌రావు, సంఘ నాయకులు నరేందర్‌రెడ్డి, శ్రీనివాసచారి, జాన్‌పా ష, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.