- కాంగ్రెస్ పాలనలో పేదలందరికీ ఇండ్లు
- రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- హౌసింగ్‌శాఖ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ
హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాం తి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసమే రాష్ట్రప్రభుత్వం తిరిగి గృహనిర్మాణశాఖను పునరుద్ధరిస్తున్నదని రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం మంత్రి గృహనిర్మాణశాఖ ఉద్యోగులకు సంబంధించిన డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు.
‘గరీబీ హఠావో’ నినాదంతో నాటి ఇందిరా గాంధీ పేదల గుండెల్లో కొలువైందని, ఆమె ఆదర్శంగా తెలంగాణలో కాంగ్రెస్ పాలన సాగిస్తున్నదని తెలిపారు. ఇందిరమ్మ పాలనలో ప్రతి పేదోడికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి, అప్పగించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. ఎన్నికలకు ముం దు పార్టీ ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నామని, వచ్చే నాలుగు సంవత్సరాల్లో దశల వారీగా పేదలందరికీ ఇండ్లు అప్పగిస్తామన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం పని చేస్తుందని, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉద్యోగులు పని చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం గృహనిర్మాణ శాఖను దుర్మార్గంగా పక్కనపెట్టిందని, ఆ శాఖ ఉద్యోగులను సైతం ఇతర శాఖల్లో విలీనం చేసిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం తిరిగి గృహ నిర్మాణశాఖను పునరుద్ధరించిందన్నారు. ఆ శాఖకు 326 మంది ఉద్యోగులను నియమించామన్నారు.
ఒక్కో ఇందిరమ్మ ఇంటిని రూ.5 లక్షలతో నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బొగ్గు ల వెంకటరామిరెడ్డి, సీనియర్ నాయకులు కంది రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు భాస్కర్‌రెడ్డి, కుమార్, రమేశ్, రఘు, లింగయ్య, సురేశ్ పాల్గొన్నారు.