calender_icon.png 31 March, 2025 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు పరిశీలించిన గృహ నిర్మాణ శాఖ ఎండీ

29-03-2025 01:31:24 AM

పటాన్ చెరు: పటాన్ చెరు నియోజకవర్గం అమీన్ పూర్ మండలంలోని జానకం పేట, జిన్నారం మండలంలోని మాదారం గ్రామాలలో గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ ఐఏఎస్ శుక్రవారం పర్యటించారు. రెండు గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. అప్పులు చేయకుండా ప్రభుత్వం ఇచ్చిన రాయితీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జానకం పేట గ్రామానికి 29, మాదారం గ్రామానికి53 ఇండ్లు మంజూరు అయ్యాయి. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ చలపతిరావు, డిప్యూటీ ఈఈ రవీందర్, ఏ ఈ సత్యనారాయణ, జిన్నారం ఎంపీడీవో అరుణ రెడ్డి, అమీన్ పూర్ ఎంపీడీవో శ్రీరామ్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.