calender_icon.png 29 November, 2024 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాతృసంస్థకు హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగులు

27-09-2024 01:22:13 AM

జీవో విడుదల చేసిన ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ 

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): గత ప్రభుత్వం హౌసింగ్ కార్పేరేషన్‌లో ఉన్న ఉద్యోగులను ఇతర శాఖలకు డిప్యూటేషన్ మీద పంపి కార్పొరేషన్‌ను మూసేసింది. దీంతో ఉద్యోగులు కొన్నేండ్లుగా ఇతర శాఖల్లో పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను చేపట్టాలని భావిస్తున్న నేపథ్యంలో సిబ్బంది కొరత దృష్ట్యా ఇతర శాఖల్లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఉద్యోగులను తిరిగి మాతృసంస్థలో తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తాని యా గురువారం ఉత్తర్వులు జారీచేశారు. మొత్తం 242  మంది ఉద్యోగులు, అధికారులను రిలీవ్ చేయాలని అన్ని శాఖలకు ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులను తిరి గి మాతృసంస్థకు తీసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు.