calender_icon.png 18 March, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదవశాత్తు చెరువులో పడి గృహిణి దుర్మరణం

18-03-2025 06:18:02 PM

పిట్లం (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన చిన్నోళ్ల సత్యవ్వ (45) మంగళవారం ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. సత్యవ్వ గ్రామంలోని ఊర చెరువుకు బట్టలు ఉతకడానికి వెళ్లి, బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోయారు. ఈత రాని కారణంగా నీట మునిగి ఊపిరి ఆడక మృతి చెందినట్లు తెలిపారు. ఆమె భర్త చిన్నోళ్ల బాలరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పిట్లం ఎస్సై రాజు తెలిపారు. గ్రామస్తులు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.