calender_icon.png 16 January, 2025 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పుల బాధతో గృహిణి ఆత్మహత్య

26-08-2024 05:02:02 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,( విజయ క్రాంతి): ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన జైనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సాగర్ తెలిపిన వివరాల ప్రకారం...  మండల కేంద్రంలోని పల్లపు లక్ష్మీ (41)కి ముగ్గురు  కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. గతకొంత కాలంగా వీరి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. 2020 సంవత్సరంలో కూతురు పెళ్లికి తీసుకున్న అప్పును ఎలా తీర్చాలో బాధపడుతూ ఉండేది. ఆదివారం రాత్రి ఇంట్లో దూలానికి  ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ సాగర్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.