calender_icon.png 7 March, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన గృహిణి ఆత్మహత్య..

06-03-2025 10:38:02 PM

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): కుటుంబ కలహాలతో మహిళ మనస్థాపానికి గురై తల వెంట్రుకలకు ఉపయోగించే రసాయనిక కలర్ ను సేవించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంపల్లి నూజివీడు ప్రాంతానికి చెందిన దేవి (32) వరంగల్ కాజీపేట సమీపంలోని రాంపూర్ ప్రాంతానికి చెందిన నాగరాజు లకు గత పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, కుమారుడు ఉన్నారు. దేవి ఓ చిన్నపాటి బట్టల షాపు నడిపిస్తుండగా నాగరాజు ఆటోడ్రైవర్ పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. వీరికి సమీప బంధువుకు తెలిసిన వారి వద్ద డబ్బులు ఇప్పించారు. అయితే వాటి విషయంలో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలకు దారి తీసింది.

దేవి తల్లిదండ్రులు ఈ విషయంపై పలుమార్లు ఇద్దరికీ సర్ది చెప్పి పంపించారు. అయినా భార్యాభర్తల మధ్య సఖ్యత కుదరకపోవడంతో నిత్యం మనోవేదనకు గురైన దేవి ఇటీవల కొంపల్లి లోని తన తల్లిదండ్రులు ఉండే నివాసానికి వచ్చింది. బుధవారం ఇంట్లో ఉన్న వెంట్రుకలు ఉపయోగించే రసాయన కలర్ ను సేవించింది. అపస్మారక స్థితిలో పడిపోవడంతో స్థానికులు కుటుంబ సభ్యులు హుటాహుటిన సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం గాంధీకి పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందింది. మృతురాలి బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.