calender_icon.png 18 March, 2025 | 5:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరకట్నం వేధింపులకు గృహిణి ఆత్మహత్య..

17-03-2025 08:00:20 PM

కంగ్టి: వరకట్నం వేధింపులకు వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన కంగ్టి మండల పరిధిలో భీమ్రా గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. కంగ్టి ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమ్రా గ్రామానికి చెందిన బోండ్ల పండరి రెడ్డి 2022 సంవత్సరంలో నాగన్ పల్లి గ్రామానికి చెందిన మహేశ్వరి(22)కి వివాహం జరిగింది. గత కొంతకాలంగా బోండ్ల పండరెడ్డి తన భార్యకు వరకట్నం వేధింపులకు గురి చెయ్యగా పలు సందర్భాల్లో గ్రామస్తులు వారిని సముదాయించిన కూడా వారి తీరు మారకపోవడంతో మహేశ్వరి మనస్థాపం చెంది సోమవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

దీంతో కుటుంబీకుల ఫిర్యాదుతో స్థానిక ఎస్సై విజయ్ కుమార్, నారాయణఖేడ్ డి.ఎస్.పి వెంకట్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి వరకట్నం వేధింపులకు గురిచేసిన భర్త బోండ్ల పండరి రెడ్డి, మృతురాలి మామ గంగారెడ్డి, బావ బసిరెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మహిళా మృతిపై గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.