మహబూబ్ నగర్: పేదలకు మోసపూరితమైనటువంటి పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించుకుంటే ఆ పట్టాలు చెల్లవని మీరు నిర్మించుకున్న ఇండ్లు అక్రమమని అర్ధరాత్రి ఇంట్లో ఉన్న వారిని బయటికి రప్పించి ఇడ్లు కూడగొట్టడం ఎంతవరకు సమంజసం అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపిస్తూ ఇల్లు కూలిపోయిన లబ్ధిదారులకు భోజన సదుపాయాలను కల్పించాలని పార్టీ నాయకులను ఆదేశించారు. శుక్రవారం కూడా ఇండ్లు కూలగొట్టిన నిరుపేదలు అక్కడే ఉండి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశం మేరకు టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్ తదితరులు కలిసి నిరసనలుగా మారిన నిరుపేదలకు ఉదయం టిఫిన్ తో పాటు అల్పాహారాన్ని అందించారు. మీకు న్యాయం చేసేంతవరకు టిఆర్ఎస్ మీ తరఫు ఉంటుందని వారు భరోసాను కలిగించారు. పట్టణ అధ్యక్షులు శివరాజ్, కౌన్సిలర్ అనంత రెడ్డిగిరి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి,నవకాంత్, శ్రీనివాస్ కౌన్సిలర్, పాలసత్తీ నయీం ఇమ్రాన్, సుల్తాన్,కిషన్ పవర్ అనిల్,రాజు, పల్లె రవి,పార్టీ కార్యకర్తలు నాయకులు కాలని వాసులు పాల్గొన్నారు