27-03-2025 01:47:09 AM
సీపీఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారధి రెడ్డి డిమాండ్
మహబూబాబాద్, మార్చి 26 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఐ భూ పోరాట కేంద్రాన్ని బుధ వారం సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి సందర్శించారు అనంతరం ఏర్పాటు చేసిన భూ పోరాట సిపిఐ సమావేశంలో బి.అజయ్ సారధిరెడ్డి మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎంతోమంది అర్హులైన నిరుపేదలు ఇంటి స్థలాలు లేక కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని వారందరికీ ఇంటి స్థలాలు వెంటనే ఇవ్వాలని అన్నారు, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అర్హులైన వారందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రజలను మోసం చేసిందని కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజలందరినీ ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పెరుగు కుమార్ రేశ పల్లి నవీన్ చింతకుంట్ల వెంకన్న ఎండి ఫాతిమా వెలుగు శ్రవణ్ ఎండి మహమూద్ ఆబోతు అశోక్ జలగం ప్రవీణ్ పద్మ మంద శంకర్, డి రమేష్ నాంచారి దాసు లాలు వంగ శీను తదితరులు పాల్గొన్నారు