05-03-2025 01:18:46 AM
జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్
జగిత్యాల, మార్చి 4 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ప్రభుత్వం నిర్దేశించిన నమూనా ప్రకారమే ఇల్లు నిర్మించుకోవాలని జగిత్యాల కలెక్టర్ బి.సత్య ప్రసాద్ సూచించారు. జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గ పరిధిలో మంగళవారం కలెక్టర్ పలుచోట్ల పర్యటించారు. మొదట ఇబ్రహీంపట్నం మండలం ఎర్రపూర్ గ్రా మం, ఎర్రపూర్ తండాతో పాటూ కథలాపూర్ మండలం పోసానిపేటలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల స్థలాలను సంబంధిత అధికారులతో కలసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తమ సొంత ఆలోచనలతో కాకుండా, ప్రభుత్వం నిర్ణయించిన నమూనా ప్రకారమే ఇండ్లు నిర్మించుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన వారికి మొదటి దశలో బేస్మెంట్ లేవల్లో రూ. 1 లక్ష, గోడల నిర్మాణ దశలో రూ. 1 లక్ష, స్లాబ్ దశలో రూ. 2 లక్షలు, మిగతావి ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకుని కలర్లు వేసిన తరువాత రూ. 1 లక్ష ప్రభుత్వం నుండి కేటాయింపు జరుగుతుందన్నారు. గృహ నిర్మాణ మేస్త్రీలు, కార్మి కులు సకాలంలో ఇండ్ల నిర్మాణానికి సహకారించాలన్నారు. ఇందిరమ్మ యాప్లో పొం దుపరిచే విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గోదాం ఆకస్మిక తనిఖీ
మెట్ పెల్లి మండలం బండలింగాపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాంను కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేసి, పలు రిజిస్టర్లను పరిశీలించారు. ఈ పాస్ ద్వార మాత్రమే రైతులకు అమ్మకాలు జరపాలని సూచించారు. ఒక రైతుకు ఎన్ని యూరియా బస్తాలు ఇస్తున్నారని విచారించారు. ప్రవేట్ ఫర్టిలైజర్స్ ద్వారా ఎలా అమ్మకాలు జరుపుతున్నారని వివరాలు తెలుసుకున్నారు.
యూరియా బస్తాలు ఎమ్మార్పీ ధరలకు మాత్రమే అమ్మకాలు జరపాలని సూచించారు. స్టాక్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకొవాలని. పిఓఎస్ మిషన్ ద్వారా మాత్రమే అమ్మకాలు చేయాలన్నారు. పట్టా పాస్’బుక్ ద్వారా ఎకరాల చొప్పున యూరి యా అమ్మకాలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. కలెక్టర్ వెంట, డిపిఓ మదన్’ మోహన్, హౌసింగ్ డిఈ ప్రసాద్, డీఎస్‌ఒ, ఆయా మండలాల ఎమ్మార్వోలు, ఎంపీడీవోలున్నారు.