మునగాల: మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ఉన్న ప్రభుత్వ భూములను గతంలో ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించిన మిగిలిన ఖాళీ స్థలాలను గుర్తించి, గ్రామ కంఠం భూములను సర్వే చేయించి అర్హులైన వారికి కేటాయించాలని మండల తహశీల్దార్ వి.ఆంజనేయిలుకు వినతిపత్రం ఇచ్చినట్లు మండల పరిధిలోని నరసింహాపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ వేమూరి సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. ముఖ్యంగా నరసింహపురంలో ఉన్న గతంలో ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించిన స్థలంలో మిగిలిన స్థలాలను గుర్తించి సర్వే చేయించి లబ్ధిదారులకు కేటాయించాలని అదే విధంగా మండల పరిధిలోని ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు మంజూరు చేసి వారికి న్యాయం చేయాలని పేర్కొన్నారు.