25-02-2025 01:27:32 AM
టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు లొట్టి శ్రీను
నారాయణపేట, ఫిబ్రవరి 23(విజయక్రాంతి): నారాయణపేట జిల్లాలో మీడియాలో పనిచేస్తున్న అరులైన జర్నలిస్టులకు వెంటనే ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలపై రాష్ర్ట యూనియన్ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యా లయం ఎదుట జర్నలిస్టులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకు లు జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్ సిక్త పట్నాయక్ కు వినతి పత్రం సమర్పించారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ నారాయణపేట జిల్లా అధ్యక్షులు లొట్టి శ్రీను మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలపై స్పందించి వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు.రాష్ర్టంలో జర్నలిస్టులపై జరిగిన దాడులపై దాడులను అరికట్టాలని , ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వెంటనే ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని అన్నారు. మహిళా జర్నలిస్టులకు పనిచేసే కార్యాలయాల నుంచి ఇంటి వరకు రాత్రిపూట రవాణా సదుపాయం కల్పించాలని విన్నవించారు.
అలాగే ఇతర రాష్ట్రాల మాదిరిగా జర్నలిస్టులకు పెన్షన్ విధానం కూడా అమలు చేయాలని తెలిపారు. అక్రిడిటెషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి టి. మాధవ్, జాతీయ కౌన్సిల్ సభ్యులు గద్దెగూడెం యాదన్న, స్టేట్ కౌన్సిల్ సభ్యులు నారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు నర్సింలు, కోశాధికారి లింగం, టిబిజెఎ జిల్లా అధ్యక్షులు ఎజాజ్ సోఫీ, మోహన్ రాజ్, శివ, ఇమామ్, బాల్ రాజ్, కేవీ. నరసింహ, వి. శ్రీనివాసులు, ఏ. ఆంజనేయులు, వై. నర్సింలు, ఆనంద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.