జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించిన జర్నలిస్టులు...
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని వివిధ దినపత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇంటి స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను కోరారు. ఈ మేరకు పట్టణానికి వచ్చిన జిల్లా కలెక్టర్ కు బుదవారం వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటు పాత్రికేయులుగా పనిచేస్తున్నామన్నారు. సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇల్లు జర్నలిస్టులకు కూడా ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించినప్పటికీ ఎవరికీ ఇవ్వలేదని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇంటి స్థలంతో పాటు, ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని జర్నలిస్టులు పాల్గొన్నారు.