calender_icon.png 18 January, 2025 | 3:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

25 ఇండ్లు పాక్షికంగా ధ్వంసం

03-09-2024 12:30:00 AM

చేగుంట/వెల్దుర్తి, సెప్టెంబర్ 2: భారీ వర్షాల కారణంగా మెదక్ జిల్లాలోని చేగుంట, వెల్దుర్తి  మండలాల పరిధిలోని పలుగ్రామాల్లో సుమారు 25 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని సోమవారం రెవెన్యూ అధికారులు ధ్రువీకరించారు. చేగుంట మండలం కసన్‌పల్లి, ఇబ్రహీంపూర్‌లో రెండు ఇండ్లు, వడియారం, గొల్లపల్లి, పోలంపల్లి, పెద్దశివునూ రు, వల్లభాపూర్, రెడ్డిపల్లిలో ఒక్కొక్కటి చొప్పున, పులిమామిడిలో మూడు ఇండ్లు దెబ్బతిన్నాయి. వెల్దుర్తి మండలంలోని ఉప్పులింగాపూర్‌లో ఆరు ఇండ్లు, రామాయపల్లిలో మరో ఆరు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.