calender_icon.png 19 January, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు

03-07-2024 12:11:38 AM

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి

ముషీరాబాద్, జూలై 2: రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టుందరికీ ఇండ్ల స్థలాలు వచ్చేలా 100 శాతం ప్రయత్నిస్తానని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జర్నలిజానికి గౌరవం కావాలంటే అక్రిడేటేషన్ అవసరమని, అర్హులకే అక్రిడేషన్లు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. జర్నలిస్టులకు ఒకే ప్రదేశంలో కాకుండా నగరానికి నాలుగు దిక్కులా స్థలాలను కేటాయిస్తామని తెలిపారు.

మండల, జిల్లా కేంద్రాల్లో ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆర్డర్‌ను అనుసరించి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు సీఎం రేవంత్ సిద్దంగా ఉన్నారని, అతి త్వరలోనే ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఐజేయూ జాతీయ స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, ఐజేయూ జాతీయ కార్య దర్శి వై. నరేందర్ రెడ్డి, హెచ్‌యూజే ప్రధాన కార్యదర్శి శిగశంకర్ గౌడ్, ప్రముఖ సంఘ సంస్కర్త కన్నాట్ సురేంద్రన్, తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాంధీ, కార్యవ ర్గ సభ్యులు నక్క శ్రీనివాస్ పాల్గొన్నారు.