calender_icon.png 4 February, 2025 | 1:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చారకొండలో ఉద్రిక్తత.. 29 ఇళ్లు కూల్చివేత

04-02-2025 11:06:25 AM

చారకొండ,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలోని చారకొండ(Charakonda) మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. బైపాస్ రహదారి నిర్మాణం కోసం జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారి(Jadcherla-Kodad National Highway)పై ఉన్న ఇళ్లను రెవెన్యూ అధికారులు(Revenue Officials) కూల్చివేశారు. చారకొండ గ్రామం మధ్యలో నుంచి బైపాస్ రోడ్డు తీసుకెళ్లడంతో 29 ఇళ్లను కూల్చివేశారు. 400 మందికి పైగా పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. గ్రామం మధ్యలో నుంచి బైపాస్ రోడ్డు తీసుకెళ్లడంపై స్థానికులు నిరసనలు వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అందుపులోకి తీసుకొని సమీప పోలీస్ స్టేషన్ కు తరలించారు.  జీవో జారీ చేసి కూల్చివేతలు చేపట్టినట్లు రెవెన్యూ అధకారులు తెలిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ ఇళ్లను కూలుస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఇళ్లలోని సామాగ్రిని రైతు వేదిక, పీఏసీఎస్ గోదాములకు సిబ్బంది తరలించారు.