- జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సుప్రీం తీర్పు బాధాకరం
- కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్
హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): బీజేపీ అధికారంలోకి రాగానే జర్న లిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. జేఎన్‌జే జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన ఇండ్ల స్థలాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడం బాధాకరమని సంజయ్ ఒక ప్రకటనలో తెలిపారు.
సుప్రీం తీర్పును గౌరవించా చాల్సిందేనని.. అయితే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు దక్కకపోవడానికి పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీతోపాటు ప్రస్తుత కాంగ్రెస్ పాలకులే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్య ఫలితమేనన్నారు.
ఈ రెండు పార్టీలు జర్నలిస్టులను రోడ్డుపాలు చేయడమే కాకుండా చేతికొస్తుందని వేయికళ్లతో ఎదురు చూసిన ఇళ్ల స్థలాలను చేతికి అందకుండా చేశాయని ధ్వజమెత్తారు. జర్నలిస్టుల నోటికాడ ముద్ద ను లాగేసుకున్నాయని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పుతో జర్నలిస్టు కుటుంబాల బాధ వర్ణణాతీతమన ఆవేదన వ్యక్తం చేశా రు. అసలు జర్నలిస్టుల చేసిన తప్పేమిటని ప్రశ్నించారు.
ఆ రెండు పార్టీలకు జర్నలిస్టులపై కక్ష
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు జర్నలిస్టుల పై కక్ష పెట్టుకున్నాయని సంజయ్ విమర్శించారు. ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా 17 ఏళ్లు జాప్యం చేస్తారా అని ప్రశ్నించారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తనకున్న విచక్షణ అధికారాలను ఉపయోగించి జర్నలిస్టులకు ఇండ్లను కేటాయించాలని సూచిం చారు. ఇచ్చిన హామీ మేరకు రాష్ర్టంలో ఇండ్లులేని అరులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాలివ్వకుండా జర్నలిస్టులకు అన్యాయం చేస్తే బీజేపీ ఊరుకోదన్నారు.
జర్నలిస్టులతో కలిసి మహోద్యమానికి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. జర్నలిస్టులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బీజేపీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌లోని జేఎన్‌జే హౌసింగ్ సొసైటీ జర్నలిస్టులతోపాటు రాష్ర్టంలోని అర్హులైైన విలేకరులందరికీ ఇండ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు.