calender_icon.png 15 March, 2025 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హౌస్ కీపింగ్ వర్క్ చేస్తున్న ఓ మహిళా అదృశ్యం

14-03-2025 07:39:01 PM

ముషీరాబాద్,(విజయక్రాంతి): హౌస్ కీపింగ్ వర్క్ చేస్తున్న ఓ మహిళ అదృష్టమైన సంఘటన గాంధీనగర్  పోలీస్ స్టేషన్  పరిధిలో గురువారం చోటుచేసుకుంది. గాంధీనగర్ ఇన్స్పెక్టర్ డి. రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్  బన్సీలాల్ పేట లోని సీసీ నగర్లో ప్లాట్ నెంబర్ 102, ఇంటి నెంబర్ 6-6426/50/2, 0 బ్లాక్ లో మక్కల సత్యమ్మ ( రేణుక) రాములు దంపతులు నివాస ముంటున్నారు. వీరికి    ముగ్గురు సంతానం.  పెద్దకూతురు ఎం. స్వప్న, శ్వేత, అఖిల  అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురైన ఎం. స్వప్న (20) అనే మహిళ హిమాయత్ నగర్ లో హౌస్ కీపింగ్ స్టాఫ్ గా పని చేస్తుంది. రోజువారీలాగే పనికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేది. ఈనెల 13న ఉదయం 10 గంటలకు వర్క్ ఫ్రం హోం కి వెళ్లి రాత్రి 9 గంటల వరకు తిరిగి రాలేదు.

దీంతో అనుమానం వచ్చిన తల్లి సత్యమ్మ   పనిచేసే చోటికి వెళ్లి స్వప్న గురించి తెలుసుకోగా పనికి రాలేదని వారు తెలపడంతో అనుమానం వచ్చిన ఆమె స్వప్నకు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బంధువులు, స్నేహితులు ఇళ్లలో వెతికిన స్వప్న ఆచూకీ తెలియ లేదు.  కాగా గత 8 నెలల క్రితం స్వప్న చింటూ అనే వ్యక్తితో ఫోన్లో చాటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. చింటూ పై అనుమానం రావడంతో   గాంధీనగర్ పోలీసుల ఫిర్యాదు చేసింది. స్వప్న ఎత్తు 5.4, గ్రే కలర్ కుర్తా, బ్లాక్ కలర్ పైజామా, బ్లాక్ చున్ని ధరించి ఉన్నట్లు స్వప్న తల్లి సత్యమ్మ  పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.  స్వప్న ఆచూకీ తెలిసిన వారు సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని ఇన్స్పెక్టర్ రాజు కోరారు.