06-03-2025 12:00:00 AM
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ప్రెస్‌మీట్‌లో దిల్ రాజు
టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకటేశ్, మహేశ్‌బాబు క్లాసిక్ బ్లాక్‌బస్టర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం 2013లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాను మార్చి 7న రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు విలేకరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విలేకరుల అడిగిన ప్రశ్నలకు దిల్ రాజు సమాధానాలిచ్చారు. ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే..
డే వన్ 60 శాతం అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయి. శుక్రవారానికల్లా అవీ ఫుల్ అయిపోతాయి. ఫ్యాన్స్, ప్యామిలీ ఆడియన్స్ టికె ట్స్ అడుగుతున్నారు. ఓవర్సీస్ లో 50 శాతం బుకింగ్స్ అయ్యా యి. రన్నింగ్‌లో ఫుల్ అవుతాయి. సుదర్శన్ 35ఎంఎం సెకండ్ డే కూడా నాలుగు షోలు ఫుల్ అయ్యాయి. మార్చి 7న సుదర్శన్ 35ఎంఎంలో మార్నింగ్ ఎనిమిది గంటల షో చూస్తా.
ఇది పరిశ్రమకు శుభ పరిణామం. మంచి సినిమాలు తీస్తే థియేటర్లకు జనం వస్తారని రీరిలీజ్‌లు ప్రూవ్ చేస్తున్నాయి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ను ఇప్పటికే ఓటీటీలో జనం చూసేశారు. అయినా మళ్లీ థియేటర్లకు వస్తున్నారంటే.. మంచి కంటెంట్ మళ్లీ చూద్దామనేని అర్థమవుతోంది.
రామారావు దగ్గర నుంచి చిరంజీవి వరకూ అందరూ మల్టీ స్టారర్స్ చేస్తూ వచ్చారు. తర్వాత ఎందుకో మారుతూ వచ్చింది. ‘సీతమ్మ వాకి ట్లో’ కాంబినేషన్ సెట్ చేయడానికి ఎంతో కష్టపడ్డాం. ఒకరోజు డైరెక్టర్ శ్రీకాంత్ ఈ స్టోరీ ఐడియా చెప్పా రు. మొదట వెంకటేశ్‌ను తర్వాత మహేశ్‌బాబును సంప్రదించాం. ఇద్దరూ కథ విని ఓకే అన్నారు. మేము అనుకున్న కథను స్క్రీన్‌పై తీసుకురావడానికి దాదాపు ఏడాది పాటు చిత్రీకరించాం.
మహేశ్, వెంకటేశ్ ఈ సినిమాకు చాలా సమయమిచ్చారు. చాలా హోమ్‌వర్క్ చేసుకున్నారు. అందుకే సినిమాలో సహజత్వం కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు రీరిలీజ్‌కు ఇంత విలువ.
ఈ సినిమా సీక్వెల్ ఎలా చేయొచ్చు అనే మంచి ఐడియా ఎవరు చెప్పినా నేను రెడీ. రీరిలీజ్ రోజు మళ్లీ చూడండి. మంచి ఐడియాతో రండి (నవ్వుతూ).
ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని భయపడాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులు చాలా క్లారిటీగా ఉన్నారు. మంచి సినిమానే చూస్తున్నారు. మొన్ననే ‘సంక్రాంతికి వస్తున్నాం’ నిరూపించింది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా రికార్డ్ స్థాయిలో వాచ్ టైమ్ వస్తోంది.
రీరిలీజ్‌కు ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారనే ఆనం దం తప్పితే కలెక్షన్ల గురించి మేము ఏమీ అంచనాలు వేయడంలేదు. ఒక నిర్మాతగా 12 ఏళ్ల తర్వాత సినిమా రీరిలీజ్‌లో హౌస్‌ఫుల్ థియేటర్ చూసిన ప్పుడు ఆ కిక్కే వేరు. ఇదే మాకు ముఖ్యం.
రీరిలీజ్‌లో కొత్త పుటేజ్ ఏమీ యాడ్ చేయడంలేదు (నవ్వుతూ). అప్పుడు ఏది విడుదల చేశామో అదే ఇప్పుడూ చేస్తున్నాం.
మా బ్యానర్‌లో వస్తున్న కొత్త సినిమాల గురించి చెప్పాలంటే.. విజయ్ దేవరకొండతో ‘రౌడీ జనార్దన’, నితిన్‌తో ‘ఎల్లమ్మ’ ఉన్నాయి. ఈ రెండు సినిమాలూ మే లోపు టేకాఫ్ అవుతాయి.