03-04-2025 05:30:15 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర 3వ వార్డులో డిసిసి అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం కామారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి మండలం షాబ్దీపూర్, క్యాసంపల్లి, ఇస్రోజివాడి, గ్రామాల్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రతిజ్ఞ బూని వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలా శ్రీనివాసరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని అన్నారు.
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంబేద్కర్‌ను అవమానిస్తూ, రాజ్యాంగాన్ని కించపరిచేలా బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో ప్రజలకు తెలియజేయడానికే ఈ కార్యక్రమం చేపట్టాం అని అన్నారు. ప్రతి వాడవాడలో ఇంటింటికి మన రాజ్యాంగ అవశ్యకతను తెలుపుతూ మహాత్మాగాంధీ, అంబేద్కర్ రాజ్యాంగాన్ని, చేత పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరకంగా నిరసనలు తెలిపి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాం అన్నారు. గాంధేయ మార్గంలో ఊరురా పాదయాత్రలో జాతీయ జెండాతో మహాత్మా గాంధీ చిత్రపటం అంబేద్కర్ చిత్రపటం భారత రాజ్యాంగం ప్రదర్శించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే దేశమనుగడ సాధ్యం అన్నారు. కేంద్రంలోని బిజెపి రాజ్యాంగ విలువలను కాలరాస్తూ మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తుందన్నారు. మతవాదుల నుండి దేశాన్ని కాపాడుకోవాలంటే మరోసారి గాందేయ మార్గంలో జై బాపూ జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ పేరుతో గ్రామ గ్రామాన పాదయాత్రలు చేపట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కామారెడ్డి మండలం క్యాసంపల్లిగ్రామంలో కరపత్రాలు పంపిణీ చేశారు. అంబేద్కర్ గొప్పతనాన్ని చాటి చెప్పి మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమములో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పండ్ల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కారంగుల అశోక్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి రాజా గౌడ్, మాజీ జెడ్పిటిసి నిమ్మ మోహన్ రెడ్డి, మైనార్టీ సెల్ కన్వీనర్ సిరాజ్ ఉద్దీన్, భూమాని బాలరాజ్, కొలిమి భీమ్ రెడ్డి, వార్డు మాజీ కౌన్సిలర్ లు పోదర్ల రాజు, పిడుగు మమత సాయిబాబు, కోయల్కర్ కన్నయ్య, తెజాపు ప్రసాద్, పీప్పిరి చందు, సాయిలు, కిరణ్, సత్యం, జాకీర్, జావిద్, సన్ని మహిళలు వార్డు ప్రజలు పాల్గొన్నారు.